https://oktelugu.com/

Bheemla Nayak: న్యాయానికి, ధర్మానికి రోజులు లేవంటున్న… బండ్ల గణేష్

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి […]

Written By: , Updated On : December 23, 2021 / 03:31 PM IST
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Bheemla Nayak

Bandla Ganesh

దిల్ రాజుతో సహా ఇతర నిర్మాతలు భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి చేసి పక్కకు తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ వసూళ్లపై ప్రభావం ఉంటుందనే కారణంతో ఇటు రాధే శ్యామ్ నిర్మాతలు, అటు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య.. దిల్ రాజు, టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో కలసి భీమ్లా నాయక్ మేకర్స్ ని రిక్వస్ట్ చేసారు. దీనితో భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

Bheemla Nayak

Bheemla Nayak

Also Read: భీమ్లానాయక్ వాయిదా పడటానికి కారణం అతనేనా?

తన చేతుల్లో ఏమీ లేకుండా పోయింది అంటూ పవన్ అభిమానులకు భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తుతూ చేసిన ట్వీట్ వివాదాన్ని ఇంకాస్త పెంచింది. దీనితో భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఇండస్ట్రీ పెద్దలని ప్రశ్నిస్తూ ట్రోల్ ట్రోల్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని వీళ్లంతా కలసి వాయిదా వేయించారు. ‘రేపు పవన్ చిత్రానికి సమస్య వస్తే ఈ నిర్మాతలంతా సాయం చేస్తారా ? అని ఓ నెటిజన్ బండ్ల గణేష్ ని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ … న్యాయానికి, ధర్మానికి రోజులు లేవు బ్రదర్ అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్… రిలీజ్ ఎప్పుడంటే