https://oktelugu.com/

Bigg Boss Kannada 11: శోభా శెట్టి ప్రవర్తన కి విసుగెత్తిపోయిన సుదీప్..మర్యాదగా బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళిపో అంటూ వార్నింగ్..అసలు ఏమైందంటే!

హౌస్ లోకి ఆమె అడుగుపెట్టిన మొదటి రోజే కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకోవడం ప్రారంభించింది. ఈమె ఇంకా మారలేదని కన్నడ బిగ్ బాస్ ప్రోమో ని చూసి మన ఆడియన్స్ కామెంట్స్ చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 2, 2024 / 02:46 PM IST

    Bigg Boss Kannada 11

    Follow us on

    Bigg Boss Kannada 11: గత సీజన్ లో బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని గడగడలాడించిన కంటెస్టెంట్స్ లో ఒకరు శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఈమె, బిగ్ బాస్ షో ద్వారా ఇంకా దగ్గరైంది. చాలా మంది ఈమె ‘కార్తీక దీపం’ సీరియల్ లో మోనిత క్యారక్టర్ ఎంత నెగటివ్ గా ఉన్నిందో, హౌస్ లో ఉన్నంత కాలం అంతకంటే ఎక్కువ నెగటివ్ గా కనిపించింది అంటూ కామెంట్స్ చేసారు. కానీ నెగటివ్ కంటెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈమె వల్ల తెలుగు బిగ్ బాస్ కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. అందుకే ఆమె 14 వారాలు హౌస్ లో కొనసాగింది. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ 8 లోకి ఆమె వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు కానీ, ఆమె కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది.

    హౌస్ లోకి ఆమె అడుగుపెట్టిన మొదటి రోజే కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకోవడం ప్రారంభించింది. ఈమె ఇంకా మారలేదని కన్నడ బిగ్ బాస్ ప్రోమో ని చూసి మన ఆడియన్స్ కామెంట్స్ చేసారు. అయితే తెలుగు బిగ్ బాస్ లో శోభా శెట్టి ఎంత నెగటివ్ కంటెంట్ ఇచ్చినప్పటికీ, టాస్కుల దగ్గరకి వచ్చేసరికి అద్భుతంగా గేమ్స్ ఆడేది. మగవాళ్ళతో సమానంగా ఇచ్చి పారేసేది. ఈ సీజన్ లో ప్రేరణ ఎలా ఉండేదో అలా అన్నమాట. కానీ కన్నడ బిగ్ బాస్ లో మాత్రం ఈమె అంచనాలను అందుకోలేకపోయింది. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టి రెండు వారాలు పూర్తి అయితే, ఈ రెండు వారాలు కూడా ఆమె గేమ్స్ ఆడేందుకు స్కోప్ రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఆదివారం ఎపిసోడ్ లో ఈమె హోస్ట్ కిచ్చా సుదీప్ కి చిర్రెత్తిపోయేలా చేసింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే కంటెస్టెంట్స్ అందరినీ సుదీప్ మీలో ఎవరు ఇంట్లో ఉండేందుకు అర్హులు కాదు అనుకుంటున్నారు అని అడగగా, దానికి అందరూ శోభా శెట్టి పేరు చెప్తారు. దానికి కారణం చెప్తూ ఈమె హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు పటాకా లాంటి అమ్మాయి అని అనుకున్నాము. టాస్కులు అద్భుతంగా ఆడి మాకి పోటీ ఇస్తుందని ఊహించాము, కానీ మా అంచనాలకు ఈమె అసలు అందుకోలేకపోయింది అని అంటారు. అప్పుడు సుదీప్ ఆమెతో మాట్లాడుతూ హౌస్ లో ఇంతమంది నువ్వు ఉండొద్దు అని కోరుకుంటున్నారు, ఎందుకు అలా?, నేను కూడా నీ నుండి చాలా ఆశించాను, కానీ అసలు గేమ్ ఆడడం లేదు అని అంటాడు. అప్పుడు శోభా శెట్టి ఎందుకో నాకు ఈ వాతావరణం సెట్ అవ్వట్లేదు సార్, నేను ఆడలేనేమో అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సుదీప్ ఆమెకి చాలా ధైర్యం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక నా విశ్వరూపం చూపిస్తాను సార్ అని అంటుంది శోభా శెట్టి. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఎపిసోడ్ చివర్లో నేను వెళ్ళిపోతాను సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటుంది. దీనికి సుదీప్ చాలా ఫైర్ అవుతాడు.

    నీకు ఇంతసేపు ధైర్యం చెప్పి, నీతో మాట్లాడిన నేను వెర్రోడిని అనుకుంటున్నావా?, నీకు ఓట్లు వేసిన ఆడియెన్స్ ని ఫూల్స్ చేయాలని అనుకుంటున్నావా?, కాసేపటి క్రితమే ఉంటాను సార్, ఆడుతాను సార్ అన్నావు, ఇప్పుడేమో ఇంతలోపే మాట మార్చేసావు?, నీలాంటి చెత్త కంటెస్టెంట్ ని నేను బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడూ చూడలేదు. నీకు వెళ్లాలని అనిపిస్తే వెళ్ళిపో అని డోర్స్ తెరిపిస్తాడు సుదీప్. ఆ తర్వాత మళ్ళీ దయచేసి నన్ను క్షమించండి సార్, నేను హౌస్ లోనే ఉంటాను అని అంటుంది. అవసరం లేదు నువ్వు మాకు అసలు, వెళ్ళిపో అని చెప్పి షో ని ముగిస్తాడు. ఇంతకీ ఆమె వెళ్లిందా లేదా అనేది నేటి ఎపిసోడ్ లో తేలనుంది.