Kiara Advani : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ(Kiara Advani). ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. అంతకు ముందే ఆమె బాలీవుడ్ లోకి మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. తెలుగు లో ఈమె ‘భరత్ అనే నేను’ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) తో ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. తెలుగు లో ఈమెకు అంతగా కలిసి రాలేదు కానీ, హిందీ లో మాత్రం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో ఒకరు. 2023 వ సంవత్సరం, ఫిబ్రవరి నెలలో ఈమె ప్రముఖ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) ని పెళ్లాడింది.
Also Read : ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకుంటున్న కియారా అద్వానీ..నిర్మాతలకు కోట్లలో నష్టం..అకస్మాత్తుగా ఏమైంది?
రీసెంట్ గానే కియారా అద్వానీ గర్భం కూడా దాల్చింది. ఈ విషయాన్నీ ఆమె నేరుగా చెప్పలేదు కానీ, పరోక్షంగా పోస్ట్ ద్వారా అభిమానులకు అర్థం అయ్యేలా చేసింది. ఇదంతా పక్కన పెడితే ఆమె అభిమానులు గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో క్లిప్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి బాగా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్ లో కియారా అద్వానీ నాకు ఆరోగ్యకరమైన కవల పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కావాలని కోరుకుంది. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ కియారా అద్వానీ కి కవల పిల్లలు పుట్టబోతున్నారు అంటూ ప్రచారం చేశారు. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు. మరి దేవుడు ఆమె తలరాత ఎలా రాసుంటే, అలాగే జరుగుద్దని సోషల్ మీడియా లో మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ చిత్రం తర్వాత కియారా అద్వానీ చేసిన మరో చిత్రం ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ గా నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తో పాటు కియారా అద్వానీ కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఆమె షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!