Samantha : విలక్షణమైన పాత్రలతో సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఈమెకు మన స్టార్ హీరోలకు ఉన్నంత ఇమేజ్, క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కేవలం 16 ఏళ్ళు మాత్రమే పూర్తి చేసుకుంది. ఈ 16 ఏళ్లలో ఆమె అందరూ చూస్తుండగానే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా సమంత కోట్లాది మంది మహిళలకు ఆదర్శప్రాయం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మానసికంగా, శారీరకంగా ఈమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఆమె స్థానంలో వేరొకరు ఉండుంటే కచ్చితంగా ప్రాణాలు తీసుకునేవారు. అలాంటి ఆదర్శ స్త్రీ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పుట్టినరోజు నేడు. నేటితో ఆమె 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
అయితే ఈ సందర్భంగా బాపట్ల కి చెందిన సందీప్ అనే అబ్బాయి, సమంత మీద వీరాభిమానం తో కట్టిన ఒక గుడి కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మూడేళ్ళ క్రితమే సమంత కోసం ఆయన ఈ గుడి ని నిర్మించాడు. ప్రతీ ఏడాది సమంత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. సమంత ఎంతో మంది పేదలకు సహాయం చేస్తుందని, ఆమెని ఆదర్శంగా తీసుకొని నా స్తోమతకు తగ్గట్టు ఈ గుడి పేరిట ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు సందీప్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. హీరోయిన్స్ కి గుళ్ళు కట్టే సంస్కృతి తమిళనాడు లో ఎప్పటి నుండో ఉంది, ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఎగబాకడం ఆశ్చర్యార్ధకం.
ఇకపోతే సమంత అనారోగ్యం కారణంగా చాలా కాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా మారిపోయింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించబోతుంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించిన సమంత, తన మొట్టమొదటి సినిమాని కొత్తవాళ్లతో నిర్మించింది. ఆ చిత్రం పేరు శుభం. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాల కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం తో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత
బాపట్లలో హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని సందీప్ pic.twitter.com/W8NHEXCBUC
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025