https://oktelugu.com/

ఆ హీరోయినే కావాలంటున్న ఎన్టీఆర్ !

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నట్లు.. నిన్న కొరటాల తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బిగ్ ఎనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కియారా అద్వానీనే అని, […]

Written By: , Updated On : April 13, 2021 / 10:06 AM IST
Follow us on

Kiara Advani NTR‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నట్లు.. నిన్న కొరటాల తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బిగ్ ఎనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కియారా అద్వానీనే అని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా తారక్, కియారా వైపే మొగ్గు చూపాడని వార్తలు వచ్చాయి.

అయితే కియరా అద్వానీ, తారక్ సినిమాలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కియారాని తెలుగులో తీసుకువచ్చింది కొరటాలనే. ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో కియరాకి మంచి బ్రేక్ ఇచ్చాడు కొరటాల. అందువల్ల కొరటాల డేట్స్ అడిగితే.. ఇప్పుడు కియారా ఓకే అనడం ఖాయం. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కియారాకి ఈ సినిమా పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

మరి ప్రస్తుతం నడుస్తోన్న కరోనా సెకెండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ సినిమాని ప్రకటించారట. అలాగే ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల పోస్ట్ చేసిన మెసేజ్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెబుతుంది. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.