https://oktelugu.com/

అతడంటే పిచ్చి అంటున్న మహేష్ బాబు హీరోయిన్..!

కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కైరా అద్వానీ. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా నటించి నటిగా కైరా మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కైరా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను ప్లస్ టూ చదివే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 22, 2020 / 10:46 AM IST
    Follow us on

    కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కైరా అద్వానీ. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా నటించి నటిగా కైరా మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కైరా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

    తాను ప్లస్ టూ చదివే సమయంలో ఒకబ్బాయిని అమితంగా ప్రేమించానని.. రోజూ అతనిని కలుసుకునేదానినని.. సెలవు రోజుల్లో సైతం ఇంట్లో అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి బాయ్ ప్రెండ్ ను కలుసుకునేదానినని వెల్లడించారు. తాను ఒక అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతున్న విషయం ఇంట్లో తెలిసిందని.. తల్లిదండ్రులు తాను చదువును అశ్రద్ధ చేస్తున్నానని తనపై సీరియస్ అయ్యేవారని తెలిపారు

    తాను ప్రేమలో ఉండటం వల్ల చదువు బుర్రకెక్కేది కాదని చదువా..? ప్రేమా..? అనే ప్రశ్న ఎదురైతే చదువును త్యాగం చేశానని వెల్లడించారు. ఆ సమయంలో వయస్సు పరిపక్వతతో త్వరగానే కోలుకున్నానని.. అయితే కొన్ని రోజులు తీవ్ర మాన్సిక సంఘర్షణను అనుభవించానని కైరా చెప్పుకొచ్చారు. తాను లవ్ చేసిన అబ్బాయి అంటే ఎంతో పిచ్చి అని అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

    బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన కైరాకు లస్ట్ స్టోరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కైరా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉంది. లక్ష్మీ బాంబ్ సినిమాతో కైరా అద్వానీ త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.