https://oktelugu.com/

 బిగ్ బాస్-4: ఈవారం డేంజర్ జోన్లో ఇద్దరు.? ఎవరు ఎలిమినేట్?

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్ల మాదిరిగానే బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ఆరువారాలు పూర్తి చేసుకొని ఏడోవారంలో కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లారు. దీంతో ఏడో ఎలిమినేటర్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం నామినేషన్లలో ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టులు ఉండటంతో బిగ్ బాస్ నుంచి ఎవరు బయటికి వెళుతారనే ఆసక్తి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 10:48 AM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్ల మాదిరిగానే బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ఆరువారాలు పూర్తి చేసుకొని ఏడోవారంలో కొనసాగుతోంది.

    ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లారు. దీంతో ఏడో ఎలిమినేటర్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం నామినేషన్లలో ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టులు ఉండటంతో బిగ్ బాస్ నుంచి ఎవరు బయటికి వెళుతారనే ఆసక్తి నెలకొంది.

    Also Read: అతడంటే పిచ్చి అంటున్న మహేష్ బాబు హీరోయిన్..!

    ఏడోవారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ కు ఎంపికయ్యారు. వీరిలో నోయల్.. అభిజిత్.. దివీ.. అరియానా.. అవినాష్.. మొనాల్ ఉన్నారు. అమ్మరాజశేఖర్ ‘బిగ్ బాస్’ ఇచ్చిన ఛాలెంజ్ టాస్క్ పూర్తి చేసి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.

    ఈవారం నామినేషన్ అయిన వారిలో నోయల్.. మొనాల్ డేంజర్ జోన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టులుగా కొనసాగుతున్న వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనే టాక్ విన్పిస్తోంది.

    కొద్దిరోజులుగా వీరి ఆటను చూస్తున్న ప్రేక్షకులకు వీరిద్దరు రియల్ గేమ్ ఆడటం లేదని భావిస్తున్నారట. దీంతో వీరికి షోలో కొనసాగే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ వారం వీరిద్దరు ఓటింగులోనూ వెనుకబడినట్లు తెలుస్తోంది.

    Also Read: ఒక్క ఐడియా.. మల్టీపెక్సుల తలరాతను మార్చనుందా?

    ఈ వారం మొనాల్ ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. మొనాల్ ను తొలి నుంచి బిగ్ బాస్ కాపాడుతున్నాడనే టాక్ ప్రేక్షకుల్లో ఉంది. గతంలోనూ ఓసారి మొనాల్ ను బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి రక్షించాడు. ఈసారి కూడా అలానే జరగనుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    మొనాల్ కోసం మరోసారి ఎలిమినేషన్ ఎత్తేస్తే షోపై కొంత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీంతో నిర్వాహాకులు ఈసారి ఎలిమినేషన్ కొనసాగిస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే..! ఏదిఏమైనా ఈసారి ఎలిమినేషన్ ఉత్కంఠగా కొనసాగనుందని తెలుస్తోంది.