Kiara Advani : బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) కి మన యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిన్న విడుదలైన ‘వార్ 2′(war 2 Movie) టీజర్ లో కియారా అద్వానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) లను డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె 2023 వ సంవత్సరం లో బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) ని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమ, పెళ్లి ఫ్యాన్స్ కి ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. పెళ్లి జరిగిన తర్వాత కియారా అద్వానీ పలు సినిమాల్లో నటించింది , ఆ సమయం లోనే ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది.
అయితే తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకొని పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు, కానీ అప్పుడే ఆమెకు ఒక బిడ్డకు జన్మని ఇచ్చినట్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇదెలా సాధ్యం, ఈ ఏడాది ప్రారంభం లో ఈమె హీరోయిన్ గా నటించిన ‘గేమ్ చేంజర్’ విడుదలైంది. ఆ సినిమా ప్రొమోషన్స్ సమయం లో కియారా ని చూసినప్పుడు గర్భం దాల్చిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు, మూడు నెలలు క్రితమే గర్భం దాల్చినట్టు పోస్ట్ పెట్టింది, ఇంతలోపే ఈ బిడ్డ ఎక్కడి నుండి వచ్చాడు అంటూ అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ ఫోటోలను ఫేక్ అని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలని అంటున్నారు.
Also Read : ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకుంటున్న కియారా అద్వానీ..నిర్మాతలకు కోట్లలో నష్టం..అకస్మాత్తుగా ఏమైంది?
కానీ చూస్తుంటే నిజమైన ఫోటోలు లాగానే అనిపిస్తుంది. అసలు ఇది నిజమా, కాదా అని అభిమానులు సైతం నిర్థారించుకోలేకపోతున్నారు. అయితే సిద్దార్థ్ మల్హోత్రా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి కానీ, కియారా అద్వానీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి కానీ ఇప్పటి వరకు ఈ ఫోటోలు రాలేదు కాబట్టి ఇది ఫేక్ గానే పరిగణించొచ్చు. అయితే సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా మారిపోయిన ఈ ఫోటోలను చూసి ఈ దంపతులు స్పందిస్తారో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ‘వార్ 2’ చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. అదే విధంగా ఆమె కన్నడ లో కేజీఎఫ్ హీరో యాష్ తో ‘టాక్సిక్’ అనే చిత్రం లో నటించింది. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. చూడాలి మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి రచ్చ చేస్తుంది అనేది.