Satyam Sundaram : గత ఏడాది దసరా కానుకగా విడుదలైన కార్తీ(Karthi Sivakumar) , అరవింద్ స్వామీ(Arvind Swamy) ప్రధాన పాత్రలు పోషించిన ‘సత్యం సుందరం'(Satyam Sundaram) చిత్రం ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో పెద్దగా ఆడకపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఈ చిత్రం ‘దేవర’ లాంటి సెన్సేషన్ ని తట్టుకొని కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఈ అందమైన చిత్రం కుటుంబ సంబంధాలను గుర్తు చేసేలా చేస్తుంది. కార్తీ, అరవింద్ స్వామీ నటన ని చూస్తే మన కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. వీళ్ళ మధ్య వచ్చే సంభాషణలు హృదయానికి అలా హత్తుకునేలా అనిపిస్తాయి. థియేటర్స్ లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఓటీటీ లో కూడా సెన్సేషన్ సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) వీక్షించాడట. ఆయనకు ఈ సినిమా ఎంతో అద్భుతంగా నచ్చిందట. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేయమని ఒక బాలీవుడ్ నిర్మాతకు ఆయన సూచించినట్టు, ఆ నిర్మాత రీసెంట్ గానే రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో షాహిద్ కపూర్ తో పాటు ఇషాన్ ఖట్టర్ కూడా లీడ్ లో కనిపిస్తాడట. ఈ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ‘సత్యం సుందరం’ అనే ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం, ఆ సినిమా లోని ఎమోషన్స్ ని రీ క్రియేట్ చేయడం అంత చిన్న విషయం కాదు. పొరపాటున రీమేక్ చేస్తే చేతులు కాల్చుకోక తప్పదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలను ఆడియన్స్ థియేటర్స్ లో అసలు ఆదరించడం లేదు. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే డిజాస్టర్ ఫలితాలను చూడాల్సి వస్తుంది. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరు తో రీమేక్ చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నాని ‘జెర్సీ’ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ఇది కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు కానీ, డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటి ట్రెండ్, ఇప్పటి ట్రెండ్ మధ్య చాలా మార్పులు వచ్చాయి అనేది వాస్తవం. మరి ఈ కల్ట్ క్లాసిక్ రీమేక్ విషయం లో సాహిద్ కపూర్ పునరాలోచన చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం సమయం, డబ్బు అన్నీ వృధా అవుతుందని అంటున్నారు నెటిజెన్స్, చూడాలి మరి ఏమి జరగబోతుందో.
Also Read : సత్యం సుందరం’ చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లేనా..? చేసి ఉంటే వేరేలా ఉండేది!