https://oktelugu.com/

Balayya: ఆ నిర్మాణ సంస్థతో బాలయ్య మల్టీస్టారర్ ఫిక్స్​.. ఇంకో హీరో ఎవరో తెలుసా?

Balayya: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాక్సీఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్​లో చేరిపోయింది. అఖండ సినిమాతో థియేటర్లకు పూర్వవైభవం వచ్చిందని పలువురు సినీ సెలబ్రిటీలు అన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం సాధించిన ఆనందంతో బోయపాటితో కలిస బాలయ్య విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన బాలయ్య.. తన తర్వాత సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 09:58 AM IST
    Follow us on

    Balayya: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాక్సీఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్​లో చేరిపోయింది. అఖండ సినిమాతో థియేటర్లకు పూర్వవైభవం వచ్చిందని పలువురు సినీ సెలబ్రిటీలు అన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం సాధించిన ఆనందంతో బోయపాటితో కలిస బాలయ్య విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన బాలయ్య.. తన తర్వాత సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

    ప్రేక్షకులు మంచ సినిమాలు ఆదరిస్తారని అఖండ సినిమాతో రుజువైందని అన్నారు. మరిన్న మంచి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు తీసుకొస్తామని.. మంచి స్టోరీ దొరికితే మల్టిస్టారర్​ కూడా చేయడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య చేయబోటే మల్టీస్టార్​పై జనాల్లో ఆసక్తి పెరిగింది. ఒకవేళ చేస్తే అందులో ఇంకో హీరో ఎవరన్న విషయంపై చర్చ నడుస్తోంది.

    Megastar Chiranjeevi

    Also Read: రాయలసీమకు జరుగుతున్న ఆన్యాయమే బాలయ్య కథ !

    తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య, చిరు కాంబోలో ఈ మల్టీస్టారర్​ సినిమా తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పుష్ప ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో త్వరలోనే మల్టీస్టారర్ తీయనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో రాబోయే మల్టీస్టార్​ ఏ రేంజ్​లో ఉండనుందో అని ఇప్పటినుంచే అంచనాలు వేసేసుకుంటున్నారు.

    ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్​ హవా నడుస్తోంది. ఇటీవలే వచ్చిన బాహుబలి నుంచి తాజాగా రానున్న ఆర్​ఆర్​ఆర్​, భీమ్లానాయక్​ సినిమాలన్నీ మల్టీస్టారర్​గానే తెరకెక్కాయి.

    Also Read: కన్నడ మీడియాకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్… కారణం ఏంటంటే