https://oktelugu.com/

Khushi kapoor- Jhanvi Kapoor: అక్క ప్రియుడితో చెల్లెలు ఎఫైర్… అతని వెంట పడుతున్న శ్రీదేవి కూతుళ్లు!

Khushi kapoor- Jhanvi Kapoor: బాలీవుడ్ అఫైర్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. టీనేజ్ కొడుకున్న 48ఏళ్ల మలైకా అరోరాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ డేటింగ్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రేమలు, సహజీవనాలు అనేకం చూశాము. తాజాగా స్టార్ కిడ్ ఖుషి కపూర్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.అక్క జాన్వీ కపూర్ మాజీ ప్రియుడు అక్షత్ రాజన్ తో ఖుషి డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వెండితెర […]

Written By:
  • Shiva
  • , Updated On : August 21, 2022 / 10:21 AM IST
    Follow us on

    Khushi kapoor- Jhanvi Kapoor: బాలీవుడ్ అఫైర్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. టీనేజ్ కొడుకున్న 48ఏళ్ల మలైకా అరోరాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ డేటింగ్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రేమలు, సహజీవనాలు అనేకం చూశాము. తాజాగా స్టార్ కిడ్ ఖుషి కపూర్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.అక్క జాన్వీ కపూర్ మాజీ ప్రియుడు అక్షత్ రాజన్ తో ఖుషి డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వెండితెర ఎంట్రీకి సిద్దమవుతున్న ఖుషి కపూర్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.కాగా ఖుషి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటోకి అక్షత్ రాజన్ LY అని కామెంట్ పెట్టారు. దాని ఫుల్ ఫార్మ్ ‘లవ్ యు’ అని.

    Khushi kapoor- Jhanvi Kapoor

    అక్షత్ రాజన్ కామెంట్ కి స్పందించిన ఖుషి కపూర్ సమాధానంగా ILU అని పెట్టారు. దాని అర్థం ‘ఐ లవ్ యు’. ఈ జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు సాధారణంగా ఐ లవ్ యూ చెప్పుకుంటారు. అంత మాత్రాన అపార్థం చేసుకోవడమేనా అని మీరు భావించవచ్చు. అయితే వీరిద్దరూ తరచూ కలుస్తున్నారు. ప్రైవేట్ పార్టీల్లో సందడి చేస్తున్నారు. ఖుషి కపూర్, అక్షత్ రాజన్ మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

    ఇదే అక్షత్ రాజన్ గతంలో జాన్వీ కపూర్ తో ఎఫైర్ నడిపినట్లు సమాచారం ఉంది. 2016లో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్ర ప్రీమియర్ కి అక్షత్ రాజన్ తో కలిసి జాన్వీ హాజరయ్యారు. అప్పటి నుండి వాళ్ళ మధ్య అఫైర్ నడుస్తోందన్న వాదన మొదలైంది. ఇక జాన్వీ పాల్గొనే ప్రతి పార్టీలో అక్షత్ రాజన్ కనిపించేవాడు. అదే సమయంలో జాన్వీతో అతడు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ప్రస్తుతం రాజన్ కి అక్క దూరం కాగా చెల్లెలు ఖుషి దగ్గరయ్యారని అంటున్నారు.

    Khushi kapoor- Jhanvi Kapoor

    మరోవైపు ఖుషి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది ఆర్చీస్’ తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. అమ్మడు కెరీర్ మొదలు కాకుండానే ఎఫైర్ రూమర్స్ తో వార్తలకెక్కుతుంది. ఇక జాన్వీ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె వెండితెరకు పరిచయమై ఐదేళ్లు కావస్తున్నా సరైన బ్రేక్ దక్కలేదు. జాన్వీ నటించిన ఒక్క చిత్రం కూడా విశేష ఆదరణ దక్కించుకోలేదు. అలియా భట్, సారా అలీ ఖాన్ వంటి స్టార్స్ కిడ్స్ దూసుకుపోతుంటే, జాన్వీ జర్నీ మెల్లగా సాగుతుంది. స్టార్స్ సరసన ఆమెకు అవకాశాలు రావడం లేదు.

    Tags