https://oktelugu.com/

Brahmaji: సామ్ చైతూ విడాకులు… 250 కోట్ల భరణమా సిగ్గూ శరం లేదంటూ మండిపడ్డ బ్రహ్మాజీ!

Brahmaji: సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నా ఏదో ఒక రూపంలో ఈ విషయం చర్చకు వస్తూనే ఉంది. 2021 అక్టోబర్ లో ఈ జంట అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. సామ్ చైతూ విడాకుల ప్రకటన తర్వాత అనేక రూమర్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమంత భరణం రూపంలో వందల కోట్ల రూపాయలు చైతన్య వద్ద తీసుకున్నారనే మాట గట్టిగా వినిపించింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 21, 2022 / 10:28 AM IST
    Follow us on

    Brahmaji: సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నా ఏదో ఒక రూపంలో ఈ విషయం చర్చకు వస్తూనే ఉంది. 2021 అక్టోబర్ లో ఈ జంట అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. సామ్ చైతూ విడాకుల ప్రకటన తర్వాత అనేక రూమర్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమంత భరణం రూపంలో వందల కోట్ల రూపాయలు చైతన్య వద్ద తీసుకున్నారనే మాట గట్టిగా వినిపించింది. ఈ వార్తలపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు.

    Brahmaji

    ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ సమంత, చైతన్య విడాకులపై వచ్చిన పుకార్ల విషయంలో అసహనం వ్యక్తం చేశారు. నాగ చైతన్య దగ్గర రూ. 250 కోట్లు తీసుకున్నావు. నువ్వు క్యారెక్టర్ లేని దానివని సమంతను ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి సమంత ఘాటైన సమాధానం ఇచ్చింది. అప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. నీకు సిగ్గూ శరం లేదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకని తిట్టాను, అని బ్రహ్మాజీ అన్నారు.

    సమంత హీరోయిన్ కాబట్టి ఆమె సినిమాల గురించి, నటన గురించి కామెంట్ చేయవచ్చు. వ్యక్తిగత విషయాల ఉద్దేశిస్తూ మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. కారణం ఏదైనా సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారు. ఎందుకో వాళ్లకు కుదరలేదని… బ్రహ్మాజీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెలెబ్రిటీలను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని ఆయన పరోక్షంగా చెప్పారు. ఈ కామెంట్స్ కి సంబంధించిన బ్రహ్మాజీ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

    Brahmaji

    వాస్తవంగా ఈ విడాకుల వ్యవహారంలో సమంత మానసిక దాడికి గురయ్యారు. ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని, పద్దతిగా ఉండటం లేదని, అఫైర్స్ పెట్టుకుందని అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. విడాకులు కారణంగా మానసిక వేదనకు గురవుతున్న నన్ను ఇలాంటి నిరాధార కథనాలతో వేధించవద్దని సమంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె కొన్ని మీడియా ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

    కాగా సమంత నాగ చైతన్య పై చాలా కోపంగా ఉన్నారనేది వాస్తవం. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉంటూనే సైలెంట్ గా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇక నాగ చైతన్యతో కలిసి జీవించిన ఇంట్లోనే సమంత ఉంటున్నట్లు సమాచారం. కొత్తగా కొన్న ఇంట్లో కాపురం పెట్టాలని భావించిన సమంత, చైతు ఉంటున్న ఇంటిని అమ్మేశారు. కొత్త ఇంటికి వెళ్లే లోపే విడిపోయారు. దీంతో సమంత అమ్మేసిన ఇల్లు తిరిగి కొన్నారట.

    Tags