Khushbu daughter wedding: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , హీరోయిన్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్ స్థాయిని సంపాదించుకున్న కుష్బూ కూతురు అవంతిక పెళ్లి నిన్న తమిళనాడు లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ నుండి ప్రముఖ నటులంతా హాజరయ్యారు. వీళ్లందరినీ ఒకే చోట చూస్తుంటే , ఇండియన్ సూపర్ స్టార్స్ రీ యూనియన్ అని అనిపించింది. మన టాలీవుడ్ నుండి చిరంజీవి , నాగార్జున , వెంకటేష్, కోలీవుడ్ నుండి త్రిష, బాలీవుడ్ నుండి అనిల్ కపూర్ , జాకీ ష్రాఫ్ తదితరులు ఈ వివాహ మహోత్సవం లో పాల్గొని వధూవరులను ఆసీవాదించారు. ముఖ్యంగా చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున ఒక చోట కలుసుకొని , గ్రూప్ గ్యాంగ్ లాగా మాట్లాడుకోవడం చూసే ప్రేక్షకులకు చాలా గొప్పగా అనిపించింది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరియు జాకీ ష్రాఫ్ లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరి మధ్య ఈ రేంజ్ సాన్నిహిత్యం ఉంది అనే విషయం ఆడియన్స్ కి ఈ పెళ్లి ద్వారానే తెలిసింది. పెళ్లి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు వీళ్లిద్దరు కలిసే ఉన్నారు. సాధారణంగా ఇలాంటి రిలేషన్ మనం ఎక్కువగా చిరంజీవి , నాగార్జున మధ్య చూస్తుంటాము, ఈ ఈవెంట్ లో వాళ్లిద్దరూ కూడా ఎంతో సాన్నిహిత్యం గా ఉన్నారు కానీ , జాకీ ష్రాఫ్ తో చిరంజీవి సందడి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది ఈ కార్యక్రమంలో. ఇకపోతే పెళ్లి సమయం లో ప్రముఖ హీరోయిన్ త్రిష చిరంజీవి పక్కనే కూర్చొని సంభాషిస్తూ ఉండడం కూడా మరో హైలైట్ గా నిల్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ రాజకీయాల్లో త్రిష పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయం లో ఆమె చిరంజీవి తో సాన్నిహిత్యం గా ఉండడం మరింత హైలైట్ గా నిల్చింది.
త్రిష తో పాటు ఆమె కాబోయే భర్త , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ వివాహ మహోత్సవానికి వచ్చి ఉండుంటే మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండేది. సాధారణంగా అయితే ఇలాంటి ఈవెంట్స్ కి ఆయన వస్తుంటాడు , కానీ ఎందుకో నిన్న రాలేదు. ఇదంతా పక్కన పెడితే కుష్బూ జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిందే. కచ్చితంగా ఈ పెళ్లి లో ఎన్టీఆర్ ని చూడొచ్చేమో అని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ వివాహ మహోత్సవానికి హాజరు కాలేదు . సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నటువంటి కుష్బూ కూతురు అవంతిక పెళ్లి వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.




