https://oktelugu.com/

ఖిలాడీ టీజర్: రవితేజ అన్ స్టాపబుల్ సైకో

తెలుగులో ఉత్సాహం ఉరకలెత్తే పాత్రలు చేయాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు రవితేజ. ఫుల్ హై ఎనర్జీతో ఆయన సినిమాల్లో కనిపిస్తారు. పంచ్ ల దగ్గర నుంచి కామెడీ , యాక్షన్ వరకు అన్నింటిలోనూ ఓ రేంజ్ లో చేసే హీరో మన రవితేజ. తాజాగా ‘క్రాక్’ మూవీతో హిట్ అందుకున్న రవితేజ.. ‘ఖిలాడీ’ సినిమాలో మరో సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఇందులో పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే మూడు పాత్రల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఖిలాడీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 12, 2021 / 10:52 AM IST
    Follow us on

    తెలుగులో ఉత్సాహం ఉరకలెత్తే పాత్రలు చేయాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు రవితేజ. ఫుల్ హై ఎనర్జీతో ఆయన సినిమాల్లో కనిపిస్తారు. పంచ్ ల దగ్గర నుంచి కామెడీ , యాక్షన్ వరకు అన్నింటిలోనూ ఓ రేంజ్ లో చేసే హీరో మన రవితేజ.

    తాజాగా ‘క్రాక్’ మూవీతో హిట్ అందుకున్న రవితేజ.. ‘ఖిలాడీ’ సినిమాలో మరో సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఇందులో పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే మూడు పాత్రల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

    ఖిలాడీ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ పూర్తి కొత్తగా కనిపిస్తున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ చిత్రంగా ఉంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు.

    ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు పాత్రలను టీజర్ లో పరిచయం చేశారు. ఒక పాత్ర ఏమో రవితేజని ఖైదీగా.. కిల్లర్ గా చూపించారు. సుత్తి పట్టుకొని వరుస హత్యలు చేసే సైకో కిల్లర్ గా కనిపించాడు. ఇక ఇదే విలన్ పాత్ర అన్నట్టుగా ఉంది. ఈ హత్యలకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది.

    టీజర్ అంతా థ్రిల్లింగ్, యాక్షన్ మోడ్ లోనే సాగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. విజువల్స్ బాగా వచ్చాయి. ఒకే ఒక్క ఇంగ్లీష్ డైలాగ్ ఇందులో ఉంది. ‘యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యూ ఆర్ అన్ స్టాపబుల్’ అని చివర్లో రవితేజ ఇంగ్లీష్ లో డైలాగ్ చెబుతాడు. దీన్ని బట్టి ఎమోషన్స్ లేని సైకోగా రవితేజ ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తోంది.