Manchu Manoj rejected Arjun Reddy : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి'(Arjun Reddy) అనే చిత్రం ఒక విజయవంతమైన ప్రయోగం. అప్పటి వరకు ఒకే మూస కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్ ని చూస్తూ వస్తున్న ఆడియన్స్ కి ఈ చిత్రం సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని కలిగించింది. అప్పట్లో ఈ సినిమా టీజర్ సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరో సినిమా రేంజ్ లో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. విజయ్ దేవరకొండ కి ఈ సినిమాతోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమాలకు హిట్/ ప్లాప్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని చాలా మంది హీరోలే మిస్ చేసుకున్నారు.
Also Read : నిండా 21 ఏళ్లు లేవు.. రెండు కంపెనీల సీఈఓ నా? ఓ యువ సాహసవంతురాలి కథ
ముందుగా సందీప్ వంగ ఈ చిత్రాన్ని అల్లు అర్జున్(Icon Star Allu Arjun), శర్వానంద్(Sharwanand) వంటి హీరోలతో చేద్దామని అనుకున్నాడు. కానీ ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ ని మంచు మనోజ్(Manchu Manoj) కి కూడా వినిపించినట్టు రీసెంట్ గానే తెలిసింది. ఆయన లీడ్ రోల్ చేసిన ‘భైరవం'(Bhairavam Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు[ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూ లో మంచు మనోజ్ ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసాడు. ఆయన మాట్లాడుతూ ‘సంపత్ నంది అప్పట్లో ‘రచ్చ’ సినిమా కథ ని నాకే ముందుగా వినిపించాడు. కానీ నాకు డేట్స్ సర్దుబాటు అవ్వకపోవడం తో వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని నా మిత్రుడు రామ్ చరణ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అందుకు నాకు చాలా సంతోషం వేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో బిజీ కాల్ షీట్స్ కారణంగా ఆటో నగర్ సూర్య చిత్రాన్ని కూడా వదులుకున్నాను. అది నాగ చైతన్య చేసాడు. పోటుగాడు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయం లో అర్జున్ రెడ్డి కథ విన్నాను. కొన్ని రోజులు అప్పట్లో సందీప్ వంగ గారితో స్టోరీ సిట్టింగ్స్ కూడా వేసాను. కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమాని వదులుకున్నందుకు ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. నిజానికి మంచు మనోజ్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే కచ్చితంగా ఆయన కెరీర్ ఇలా ఉండేది కాదు, 9 ఏళ్ళ విరామం కూడా తీసుకోవాల్సి వచ్చేది కాదు. ఎల్లప్పుడూ సరికొత్త కథలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వాలని అనుకునే మనోజ్ ఈ చిత్రాన్ని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చిందో ఆయన్ని అభిమానించే వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. ఇది మాత్రం ఆయన కెరీర్ లో కాస్టలీ మిస్ అనే అనుకోవాలి.