Khaidi 2 Movie : తెలుగు, తమిళ భాషల్లో సైలెంట్ గా విడుదలై సునామీ ని సృష్టించిన చిత్రాల్లో ఒకటి కార్తీ(Karthi sivakumar) హీరోగా నటించిన ‘ఖైదీ'(Khaidi Movie). ప్రస్తుతం ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కి ఈ సినిమా నుండే గొప్ప పేరు రావడం మొదలు పెట్టింది. అంతకు ముందు వరకు కూడా ఆయన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సినిమా మాత్రం ఆయన్ని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలు ఎంతటి సంచలన విజయాలు గా నమోదు అయ్యాయో మన కళ్లారా చూసాము. యూత్ ఆడియన్స్ లోకేష్ సినిమాలంటే మెంటలెక్కిపోయే రేంజ్ లో అతి తక్కువ సమయంలోనే ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన ‘కూలీ’ చిత్రం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది.
Also Read : ‘భైరవం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మంచు మనోజ్ కి గేమ్ చేంజర్ కానుందా?
ఇదంతా పక్కన పెడితే లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి అని ఎవరినైనా అడిగితే, అత్యధిక శాతం మంది ‘ఖైదీ’ సినిమా పేరునే చెప్తారు. కేవలం ఒకే ఒక్క రాత్రి జరిగిన స్టోరీ తో అప్పటి వరకు ఎలాంటి సినిమాలు రాలేదు. ఇలాంటి డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అంటే ఆడియన్స్ కి తెగ పిచ్చి. ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గానే లోకేష్ ‘కూలీ’ చిత్రాన్ని పూర్తి చేసాడు కాబట్టి, ఆ సినిమా విడుదలైన రెండు మూడు నెలల్లోనే ‘ఖైదీ 2’ ని మొదలు పెట్టనున్నాడు. హీరో కార్తీ కెరీర్ కి ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సినిమా హిట్ అయితే తమిళనాడులో ఆయన టాప్ 5 స్టార్ హీరోస్ లో ఒకడిగా మారిపోతాడు.
అయితే ఈ సినిమాని మామూలు రేంజ్ లో తియ్యాలని మాత్రం అనుకోవడం లేదట డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మొదటి భాగం ని పెద్దగా బడ్జెట్ లేకుండా చాలా సింపుల్ గా తీసేసాడు. కానీ సీక్వెల్ కి మాత్రం ఆయన భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట. అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఎంట్రీ ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. లోకేష్ తో రామ్ చరణ్ సినిమా ఖరారై చాలా రోజులు అయ్యింది. మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని లోకేష్ కూడా అనేక సందర్భాల్లో పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రామ్ చరణ్ ని ఈ చిత్రం ద్వారా ఈ యూనివర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట లోకేష్. ఈ సినిమా తర్వాత ఆ క్యారక్టర్ ని పొడిగిస్తూ రామ్ చరణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సినిమా చెయ్యాలి అనేదే ప్లాన్. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్ మాత్రమే, నిజమైతే మాత్రం అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు.