Samantha : అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత(Samantha Ruth Prabhu), నాగ చైతన్య లు ఎవరి కెరీర్ ని వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగ చైతన్య గత ఏడాది శోభిత ని పెళ్లి చేసుకొని సంతోషంగా తన దాంపత్య జీవితం గడుపుతున్నాడు. మరోపక్క పెళ్లి తర్వాత ఆయన హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక సమంత రీసెంట్ గానే నిర్మాత గా మారి ‘శుభమ్’ అనే చిత్రం చేసి సూపర్ హిట్ ని కూడా అందుకుంది. అయితే ఏదైనా ఇంటర్వ్యూ లో సమంతకు నాగ చైతన్య కి సంబంధించి ఏదైనా ప్రశ్న ఎదురైతే, ఆమె అతని పేరుని ప్రస్తావించకుండానే మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నాగ చైతన్య కి ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం సమంత గురించి గొప్పగా మాట్లాడాడు.
Also Read : ఖైదీ 2′ లో రామ్ చరణ్..? ఫ్యూజులు ఎగిరే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్!
మాకు విడాకులు జరగడం ఒక దురదృష్టపు సంఘటన అంటూ నాగ చైతన్య అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. కానీ సమంత నుండి అంత సున్నితమైన సమాధానం వచ్చేది కాదు, అతను నేను ఇప్పుడు ఒకే గదిలో ఉండే పరిస్థితి వస్తే, ఆ గదిలో ఎలాంటి ప్రాణహాని కలిగించే వస్తువులు ఉండకూడదని కోరుకుంటాను, ఉంటే ఏమి చేస్తానో నాకే తెలియదు అంటూ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. విడాకులు తర్వాత సమంత అక్కినేని కుటుంబానికి దూరం గా ఉంటూ వస్తుంది. కానీ అక్కినేని అఖిల్ కి మాత్రం ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు రెండు మూడు సార్లు శుభాకాంక్షలు కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గానే అక్కినేని కుటుంబం, అదే విధంగా సమంత కలిసి ఒకే ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
రీసెంట్ గా జీ తెలుగు లో ఒక అవార్డు ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి సమంత వచ్చింది, అక్కినేని అమల కూడా వచ్చింది. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత కి జీ తెలుగు వారు అవార్డుని అందించారు. ఆ తర్వాత ఆమె ఇచ్చిన ఒక ఎమోషనల్ స్పీచ్ కి అక్కినేని అమల సైతం చప్పట్లు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ని మీరు క్రింద చూడవచ్చు. సమంత తో పాటు అమలకు కూడా 30 సంవత్సరాల నుండి జంతు సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు చేసినందుకు స్పెషల్ అవార్డు ని అందించారు. ఇలా మాజీ అత్తా, మాజీ కోడలు ఒకే ఈవెంట్ లో కనిపించడం అయితే జరిగింది కానీ, వీళ్ళు కలుసుకొని మాట్లాడుకున్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.