https://oktelugu.com/

Chiranjeevi Old Movie: KGF మూవీ చిరంజీవి పాత సినిమాకి రీమేక్?? బయటపడ్డ షాకింగ్ నిజాలు

Chiranjeevi Old Movie: మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలను చూసి ఆదర్శంగా తీసుకొని నేటి తరం దర్శకులు నేటి తరం ప్రేక్షకులకు తగ్గట్టు తీర్చి దిద్దితూ సక్సెస్ అయినా వారు ఎంతో మంది ఉన్నారు..అలాంటి దర్శకులలో ఒక్కరే ప్రశాంత్ నీల్..KGF చాప్టర్ 2 విడుదలకి ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఈయన ఇచ్చిన ఇంటర్వూస్ నెటిజెన్ల ఎంతో ఇష్టపడుతున్నారు..ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్న మాటలను మొహమాటం లేకుండా చెప్పిన ప్రశాంత్ నీల్ మాట తీరుని ప్రతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 19, 2022 / 05:29 PM IST
    Follow us on

    Chiranjeevi Old Movie: మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలను చూసి ఆదర్శంగా తీసుకొని నేటి తరం దర్శకులు నేటి తరం ప్రేక్షకులకు తగ్గట్టు తీర్చి దిద్దితూ సక్సెస్ అయినా వారు ఎంతో మంది ఉన్నారు..అలాంటి దర్శకులలో ఒక్కరే ప్రశాంత్ నీల్..KGF చాప్టర్ 2 విడుదలకి ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఈయన ఇచ్చిన ఇంటర్వూస్ నెటిజెన్ల ఎంతో ఇష్టపడుతున్నారు..ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్న మాటలను మొహమాటం లేకుండా చెప్పిన ప్రశాంత్ నీల్ మాట తీరుని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు..ఈ ఇంటర్వూస్ లో ఆయన మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద ఫ్యాన్ ని అని..ఆయన పాత సినిమాల ప్రభావం నా ఫిలిం మేకింగ్ లో కచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు..KGF సిరీస్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పాత సినిమాల ఆధారంగానే తీసాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్..ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని బాషలలో ప్రభంజనం సృష్టించిన KGF సిరీస్ కి చిరంజీవి గారి ఏ సినిమాని ఆధారంగా తీసుకొని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు..అంతలా ఆయనని ప్రభావితం చెయ్యడానికి ఆ సినిమాలో ఏమి ఉంది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

    KGF

    1986 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన రాక్షసుడు అనే సినిమా విడుదల అయ్యింది..అప్పట్లో ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది..కమర్షియల్ మాస్ హీరో గా ఆయన ఇమేజి ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా..ఒక్కసారి ఈ సినిమా స్టోరీ ని పరిశీలిస్తే..చిరంజీవి తల్లి కి ఈ సినిమా లో భర్త చిరంజీవి జన్మించాక ముందే చనిపోతాడు..ఆ తర్వాత ఒక్క రోజు పసిబిడ్డ గా ఉన్న సమయం లోనే తన తల్లి నుండి పొరపాటున తప్పిపోయాయి ఒక్క మందు కి బానిస అయినా వ్యక్తికీ దొరుకుతాడు..అతని సంరక్షణ లోనే పెరిగి పెద్దవాడు అవుతాడు చిరంజీవి…వయస్సుకి వచ్చిన తర్వాత తన తల్లి బ్రతికే ఉంది అనే నిజం ని తెలుసుకొని ఆమె ఎక్కడ ఉందొ తెలుసుకోడానికి అన్వేషణ మొదలు పెడుతాడు చిరంజీవి..ఈ క్రమం లో రావు గోపాల రావు దగ్గర పని చేస్తూ మాలిక ద్రవ్యాల సరఫరా చేస్తూ ఉంటాడు..రావు గోపాల రావు చిరంజీవి ని తాను అక్రమంగా చేస్తున్న ప్రతి పనికి బాగా వాడుకుంటాడు..కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే చిరంజీవి తల్లి ని అపహరించి 20 ఏళ్ళ నుండి తన బానిసగా కూలి పనులకు వాడుకుంటాడు..తన తల్లిని చిన్నతనం లోనే దూరం చేసి ఒక్క కూలీగా వాడుకుంటున్న రావు గోపాల రావు దురాచారాలను తెలుసుకొని అతని చీకటి సామ్రాజ్యం లో చిక్కుకున్న తన తల్లిని అతని నుండి ఎలా రక్షించాడు అనేదే స్టోరీ.

    Also Read: Beast Movie Collections: ‘బీస్ట్’ దెబ్బకు దిల్ రాజుకు ఎన్ని కోట్లు ఊస్ట్ అంటే ?

    స్టోరీ పరంగా KGF కి రాక్షసుడు సినిమాకి పెద్ద తేడా ఏమి ఉండదు..టేకింగ్ కూడా దాదాపుగా ఈ సినిమా నుండి తీసుకున్నదే..ఈ సినిమాని కావాలి అంటే మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు..సినిమా చూసిన తర్వాత KGF మూవీ ప్రతి ఒక్కరికి గుర్తు రాక తప్పదు..అలా అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రభంజనం సృష్టించిన రాక్షసుడు మూవీ ని ఆధారంగా తీసుకొని నేడు KGF అనే సినిమా తో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నాడు ప్రశాంత్ నీల్..కేవలం 5 రోజుల్లోనే 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లోనే ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరు అంచనా వెయ్యలేక ఉన్నారు..వీక్ డేస్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ అతి త్వరలోనే ఆల్ టైం టాప్ 3 లిస్ట్ లోకి చేరబోతోంది.

    Also Read: Byreddy Siddharth Reddy: వైసీపీకి బైరెడ్డి బైబై.. టీడీపీ గూటికి ఫైర్ బ్రాండ్ సిద్ధార్థ్ రెడ్డి

    Tags