IPL 2022: సీఎస్ కే ప్లే ఆఫ్స్ పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చా..? అన్ని మ్యాచ్ లు గెలిస్తెనే ఛాన్స్..

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత స‌క్సెస్ ఫుల్ ప్ర‌స్థాన‌మో అంద‌రికి తెలిసిందే. మిగతా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ లో రికార్డులు సృష్టించింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. సీనియర్ ఆటగాళ్లతో డాడీస్ ఆర్మీ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ వరుసగా టైటిల్ గెలుస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రించింది. ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత గా నిలిచి తిరుగులేద‌ని నిరూపంచుకుంది చెన్నై సూపర్ […]

Written By: Mallesh, Updated On : April 19, 2022 6:17 pm
Follow us on

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత స‌క్సెస్ ఫుల్ ప్ర‌స్థాన‌మో అంద‌రికి తెలిసిందే. మిగతా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ లో రికార్డులు సృష్టించింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. సీనియర్ ఆటగాళ్లతో డాడీస్ ఆర్మీ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ వరుసగా టైటిల్ గెలుస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రించింది. ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత గా నిలిచి తిరుగులేద‌ని నిరూపంచుకుంది చెన్నై సూపర్ కింగ్.

IPL 2022

అయితే ఈ సీజ‌న్ లో మాత్రం వరుస ఓట‌ముల‌తో చ‌త‌కిల‌ప‌డింది. 2020 సీజన్‌లో ఇలాగే తడబడి ప్లేఆఫ్స్‌ కూడా చేరకుండా ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. ఒక్కటే గెలిచింది. దీంతో ఈ సారి కూడా జ‌ట్లు ప్లే ఆప్స్ పై సందిగ్ద‌త నెల‌కొంది. అయితే 2020 ఘోర ఓటమి తర్వాత గతేడాది పూర్వ వైభ‌వం చూపించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ప్ర‌స్తుతం జడేజా నేతృత్వంలో ఐదోసారి కప్పు బ‌రిలోకి దిగ‌గా ప్లే ఆప్స్ కూడా చేరుకోవ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చెన్నై కనీసం ప్లే ఆఫ్స్‌ అయినా చేరుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Also Read: Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్‌..!?.. ఎవరికి ఛాన్స్ అంటే?

చెన్నై 2010లోనూ ఇలాగే ఆరంభంలో తడబడింది. తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలైనా చివరికి విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు.. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి 14 పాయింట్లతో నిలిచింది. ఫైనల్‌కు చేరి తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా అనే ఆశ‌లు అభిమానుల్లో చిగురిస్తున్నాయి. వరుసగా నాలుగు ఓటముల అనంతరం ఐదో మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం సాధించడంతో ఆశలు చిగురించినా మళ్లీ ఆరో మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది.

IPL 2022

7 మ్యాచ్ లు త‌ప్ప‌నిస‌రి గెల‌వాల్సిందే..

ఈ సారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా 14 పాయింట్లు సాధించాలి. చెన్నై ముందే బెర్తు ఖాయం కావాలంటే 16 పాయింట్లు సాధించాలి. అప్పుడు నెట్‌రన్‌ రేట్‌తో సంబంధం లేకుండా టాప్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, చెన్నై ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలవడంతో కేవలం 2 పాయింట్లతోనే ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అలాంటప్పుడు మిగతా జట్లను దాటి ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకో 14 పాయింట్లు కావాల్సి ఉంది. అంటే ఇకపై ఆడాల్సిన 8 మ్యాచ్‌ల్లో ఏడు తప్పక గెలవాల్సిందే. ఒకవేళ ఆరు గెలిస్తే ఆఖర్లో రన్‌రేట్‌ విషయంలో ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. కానీ, చెన్నై ప్రస్తుత రన్‌రేట్‌ (-0.638) పరిస్థితి మైనస్‌లో ఉండటంతో అది కూడా క‌ష్ట‌మే అనిపిస్తుంది.

సీఎస్ కే ప్లేయ‌ర్ల ఆట తీరు..

ప్రస్తుతం జట్టులో శివమ్‌ దూబే, రాబిన్‌ ఉతప్ప మాత్ర‌మే రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతడే కీలక ఆటగాడిగా మారాడు. మరోవైపు ఓపెనర్‌గా రాబిన్‌ ఉతప్ప రాణిస్తున్నా.. గతేడాది టాప్ స్కోరర్‌, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇబ్బందులు పడుతున్నాడు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతడు రాణించడం ఊరటనిచ్చే విషయం. తర్వాత అంబటి రాయుడు అంతంత మాత్రంగానే ఉన్నాడు. కెప్టెన్‌ జడేజా ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు ధోనీ తొలి మ్యాచ్‌లో మెరిసినా తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. బౌలింగ్‌లో బ్రావో, మహీష్‌ తీక్షణ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై 8 మ్యాచ్‌ల్లో 7 గెలవాలంటే అద్బుతం జ‌రిగితే త‌ప్పా క‌ష్ట‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాల్సిందే..

Also Read:RRR Box Office Collection: RRR: 4 వారాల్లో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?
Recommended Videos

Tags