https://oktelugu.com/

‘సలార్’ కథ పై కేజీఎఫ్ డైరెక్టర్ క్లారిటీ !

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా “సలార్”. తాజాగా ఈ సినిమా పై వస్తోన్న రూమర్ పై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా రీమేక్ కాదంటున్నాడు ఈ దర్శకుడు. కేజీఎఫ్ స్టోరీ రాసుకున్న టైమ్ లోనే సలార్ కాన్సెప్ట్ అనుకున్నాడట. ఇది పూర్తిగా కొత్త కథ అంటున్నాడు. కన్నడ సినిమా ఉగ్రమ్ సినిమాకి సలార్ రీమేక్ అని […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 04:23 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా “సలార్”. తాజాగా ఈ సినిమా పై వస్తోన్న రూమర్ పై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా రీమేక్ కాదంటున్నాడు ఈ దర్శకుడు. కేజీఎఫ్ స్టోరీ రాసుకున్న టైమ్ లోనే సలార్ కాన్సెప్ట్ అనుకున్నాడట. ఇది పూర్తిగా కొత్త కథ అంటున్నాడు. కన్నడ సినిమా ఉగ్రమ్ సినిమాకి సలార్ రీమేక్ అని వార్తలు వచ్చాయి.

    Also Read: సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురు !

    అయితే, ఉగ్రమ్ సినిమాలో లాగా సలార్ సినిమాలో కూడా హీరో మాఫియా డాన్ అని, ఇది కూడా అండర్ వరల్డ్ కథ అని.. అందుకే సలార్ సినిమా కూడా దాదాపు ఉగ్రమ్ కథే అని బాగా వార్తలు రావడంతో ప్రశాంత్ నీల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ ఉండబోతుందట. ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ అంటే.. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటేనే ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేస్తారు. ఈ క్రమంలో సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: అనిల్ రావిపూడి పర్యవేక్షణలో “గాలి సంపత్” !

    ఇక ప్రభాస్ గత కొన్ని సినిమాలుగా. అలా సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ – ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోణును హీరోయిన్ గా లాక్ చేశారు. అలాగే త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా ఫిబ్రవరి నుండి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తారని.. ముందుగా ప్రభాస్ పైనే షూట్ చేస్తారని తెలుస్తోంది. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్