https://oktelugu.com/

KGF Chapter 2 Trailer Records: రికార్డుల మోత మోగిస్తున్న `కేజీఎఫ్ 2` ట్రైలర్

KGF Chapter 2 Trailer Records: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ సంచనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను , తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను […]

Written By: , Updated On : March 29, 2022 / 05:42 PM IST
Follow us on

KGF Chapter 2 Trailer Records: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ సంచనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను , తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను , మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

KGF Chapter 2 Trailer Records:

KGF Chapter 2 Trailer

దీంతో ‘రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ లో అదనపు హంగులు కోరుకుంటారనే మేకర్స్ అన్ని ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అండ్ అద్భుత విజువల్స్ ను నింపేశారు. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్‌ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ షాట్స్ అండ్ బిల్డప్ షాట్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

Also Read: OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

ముఖ్యంగా యశ్ చెప్పిన డైలాగ్ లు చాలా బాగున్నాయి. ఇక ఈ కథలోని కీలక సంఘటనల గురించి ప్రకాష్ రాజ్ ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ ట్రైలర్ ప్రేక్షకులపై గట్టి ముద్రనే వేసింది. మెయిన్ గా విజువల్స్ అత్యున్నతంగా ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ అలరిస్తాయి. పైగా కీలక పాత్రలను దర్శకుడు చాలా చక్కగా డిజైన్‌ చేశాడు. దీనికితోసు అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ట్రైలర్‌ స్థాయిని పెంచింది.

యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అసలు ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది.

KGF Chapter 2 Trailer Records:

KGF Chapter 2 Trailer

అందుకే సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ కి సిద్ధమయ్యే లోపు, సెకెండ్ వేవ్ తో ‘కేజిఎఫ్ 2’కి భారీ దెబ్బ తగిలింది. ఇప్పుడు సోలో డేట్ తో మళ్ళీ రిలీజ్ కి సన్నద్ధం అయ్యింది. ఏది ఏమైనా 2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందింది. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి.

విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు. అన్నిటికిమించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది.

Also Read: Senthil Kumar: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు తేడా అదేనట?

Tags