https://oktelugu.com/

KGF 2 2nd Day Collections: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాంక్..?

KGF 2 2nd Day Collections: రిలీజ్ కు ముందు వున్న అంచనాలను సజీవంగా నిలిపి సరికొత్త రికార్డుల వేటలో కేజీఎఫ్2 దూసుకుపోతుంది. కేజీఎఫ్1 కంటే కేజీఎఫ్2 సినిమానే అధిక వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజు ఇండియా మొత్తంగా రూ.134.5 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.165 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. మొదటి షో నుండే కలెక్షన్ల కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరు […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 16, 2022 / 11:59 AM IST
    Follow us on

    KGF 2 2nd Day Collections: రిలీజ్ కు ముందు వున్న అంచనాలను సజీవంగా నిలిపి సరికొత్త రికార్డుల వేటలో కేజీఎఫ్2 దూసుకుపోతుంది. కేజీఎఫ్1 కంటే కేజీఎఫ్2 సినిమానే అధిక వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజు ఇండియా మొత్తంగా రూ.134.5 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.165 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. మొదటి షో నుండే కలెక్షన్ల కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.

    KGF 2 2nd Day Collections

    రెండో రోజు ఉత్తరాదిన కేజీఎఫ్2 ప్రభంజనాన్నే సృష్టించింది. రెండో రోజు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కాగా తొలిరోజు రూ.53.5 కోట్లు వసూల్ చేయగా రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్, కరెంట్ బుకింగ్స్ తో కలిపి రూ.35 కోట్ల నుండి రూ.40 కోట్ల వరకు వసూలు రాబట్టింది. హైదరాబాద్ సిటీ లో కూడా కేజీఎఫ్2 జైత్రయాత్ర కొనసాగుతుంది. రెండో రోజు రూ.4.66 కోట్లు వసూల్ చేసింది. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రం రెండో రోజుకు రూ.9.90 కోట్లు వసూల్ చేయగా, పుష్ప రూ.4.6 కోట్లు, భీమ్లా నాయక్ రూ.4.29 కోట్లు, రాధేశ్యామ్ చిత్రం రూ.4.05 కోట్లు వసూల్ చేసింది.

    Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?

    ఇతర భాషల్లో కూడా కేజీఎఫ్2 జోరు తగ్గలేదు. కన్నడలో రూ.6.91 కోట్లు, తమిళంలో రూ.3.4 కోట్లు, మలయాళంలో రూ.1.51 కోట్లు మేరా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. చెన్నై, చెంగల్పట్టు ప్రాంతాల్లో కూడా కేజీఎఫ్2 ప్రభావం బాగానే కనిపించింది. 321 షోల ద్వారా రూ.1.3 కోట్లు రాబట్టినట్టు సమాచారం.దీంతో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయే ఆస్కారం దగ్గర్లోనే వుంది.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 జైత్రయాత్ర ఆపేవారు లేకుండాపోయారు. రెండో రోజు రూ.30 కోట్లకు చేరువైంది. తొందర్లోనే రూ.50 కోట్ల మార్క్ టచ్ చేసి రూ.100 కోట్లకు చేరువవుతుంది ఈసినిమా. ఓవర్సీస్ లో రూ.15 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండోరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.115 కోట్ల నుండి రూ.120 కోట్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూ.500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉండని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    Also Read: KGF2 : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

    Tags