Nityamenen: ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను షోలోని కంటెస్టెంట్స్ పాడి తమ పాటలతో మెప్పించారు. ప్రముఖ సింగర్ కల్పన ఈ షోకు అతిథిగా హాజరై మెప్పించారు. శ్రీరామచంద్ర ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర జడ్జీలపై కవితలు రాసి మెప్పించారు.
పాపం అని శ్రీరామచంద్ర చెబుతుంటే అది మా శాపంరా అంటూ థమన్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత నిత్యామీనన్ గురించి కవిత చెప్పబోతూ శ్రీరామచంద్ర తెగ సిగ్గు పడ్డారు. “నిత్యగారూ.. మీ చూపొక చలివేంద్రం.. అది మా అందరికీ ఇంధనం.. నేను ఇంత ఎనర్జీతో ఉండటానికి మీరే కారణం.. తెలుగు ఇండియన్ ఐడల్ కు మీరొక అందాల తోరణం” అని అన్నారు. ఆ తర్వాత థమన్ అన్నకు నేను చెప్పనని హర్ట్ అయ్యానని శ్రీరామచంద్ర కామెంట్ చేశారు.
ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ షో వల్ల ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.