పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై చూసి చాలా రోజులైంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన‘అజ్ఞాతవాసి’ ఆయన చివరి మూవీ. అది బాక్సాఫీస్ దెబ్బ డిజాస్టర్గా మారింది. అప్పటికే రాజకీయాల్ల అడుగు పెట్టిన పవన్ ‘అజ్ఞాతవాసి’ అనంతరం ఇండస్ట్రీకి దూరయ్యాడు. అప్పటి నుంచి పవన్ తిరిగి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు పవన్. పాలిటిక్స్‌కే జీవితం అంకింతం అని ప్రకటించిన తర్వాత మనసు మార్చుకున్న జనసేనాని మళ్లీ మేకప్ వేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’ అంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతుతున్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ ‘పింక్’ మూవీ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్’తో పవన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకురానున్నారు.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
విరామం తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షెడ్యూల్స్‌లో షూటింగ్ కూడా చేశారు. ఇప్పటికే పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల కిందట పవన్ లాయర్ గెటప్‌లో ఉన్న పవన్ కోర్టు సీన్ స్టిల్ లీక్ కాగా…సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌పై పాత్రపై సస్పెన్స్ వీడడం లేదు. దాంతో, దీని గురించి రోజుక వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ సరసన నటిస్తున్నట్టు పలువురి పేర్లు వినిపించాయి. చివరకు శ్రుతి హాసన్‌ను ఫిక్స్ చేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది. మాతృక హిందీ ప్రకారం ఇందులో ముగ్గురు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లకు అవకాశం ఉంది. ఇప్పటికే అంజలి, నివేదా థామస్, అనన్య పేర్లు ఖరారయ్యాయి. మొన్న లీకైన కోర్టు సీన్‌లో కూడా పవన్ పక్కన అంజలి కనిపించింది. ఆమెనే ప్రధాన హీరోయిన్ అన్న అభిప్రాయం కలుగుతోంది. వాస్తవానికి హిందీ కథ ప్రకారం.. హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్‌కు ఆస్కారం లేదు. కానీ, ‘పింక్’లో అమితాబ్ వృద్ధ లాయర్గా కనిపిస్తాడు. కానీ, పవన్ వయసు, స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని తెలుగులో అనేక మార్పులు చేశాడట దర్శకుడు శ్రీరామ్.
టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?
ఈ క్రమంలోనే హీరోతో ఆడిపాడే హీరోయిన్ క్యారెక్టర్ను రాసుకున్నాడట. ఆ పాత్ర కోసం ఇలియానా నుంచి శ్రుతి హాసన్ వరకూ పలువురిని సంప్రదించగా… చివరకు తమన్నాకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. పవన్ తో ఇది వరకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో నటించిన మిల్కీ బ్యూటీ పవర్స్టార్తో మరోసారి సినిమా అనగానే వెంటనే అంగీరించిందని టాలీవుడ్ టాక్. కానీ, ఇది ఎంత వరకు నిజం? ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలో హీరోతో ఆడిపాడే హీరోయిన్‌కు చాన్సుందా? అనేది చిత్ర బృందమె వెల్లడించాలి.