‘KGF-2’ Crazy Updates: యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్-2’ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘నిజానికి ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. నా పాత్రకు అధీర, రమిక సేన్ పాత్రలకి మధ్య ఉన్న సంబంధం ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

అది నేను గత ఆరేళ్లుగా దాచి ఉంచిన రహస్యం’’ అని చెప్పుకొచ్చింది శ్రీనిధి. మరి ఏమిటి ఆ రహస్యం ? ఒకవేళ అధీరా – రమిక సేన్ ప్రేమించుకుని.. వీరిద్దరికీ రీనా పుట్టిందేమో. ఇది గాని నిజం అయితే.. మొత్తానికి ఇది షాకింగ్ విషయమే అవుతుంది. ఇక కేజీఎఫ్ క్రేజ్‌ని పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటున్నాడు ప్రశాంత్. పైగా సలార్ ని నిర్మించేది కూడా కేజీఎఫ్ నిర్మాతే.
అందుకే.. ‘కేజీఎఫ్ 2’ చిత్రం ప్రదర్శితమయ్యే థియేటర్లలో సలార్ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే.. ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ కి పండగే. ఏది ఏమైనా ‘కేజీఎఫ్ 2’ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ట్రేడ్ పండితులు సంచలన విషయాలను తెలుపుతున్నారు.
వారి ప్రకారం కేజీఎఫ్ 2 నైజాం రైట్స్ రూ. 50 కోట్లకు పైమాటేనట. సర్కారు వారి పాట రూ. 45 కోట్లు పలికినట్టు సమాచారం. ఇక కోస్టల్ ఆంధ్రాలోనూ ‘కేజీఎఫ్ 2’ రైట్స్ ఆచార్యతో సమంగా అమ్ముడుపోయ్యాయి. కాకపోతే.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సాధించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే ‘కేజీఎఫ్2’ ఆ రికార్డులను తుడిచిపెట్టేలా ఉంది.

హిందీ వర్షన్ మొదటి రోజు వసూళ్లలో, ది కశ్మీర్ ఫైల్స్ కారణంగా, రూ. 19 కోట్లే వసూలు చేసింది ఆర్ఆర్ఆర్. దీనికి డబుల్ వసూళ్లను సాధించనుంది కేజీఎఫ్2. హిందీ ట్రేడ్ వర్గాల ప్రకారం, హిందీ బెల్ట్ లోనే మొదటిరోజు రూ. 40 కోట్లు వసూలు చేస్తుందని బుకింగ్స్ ను బట్టి అర్ధం అవుతుంది.