Pawan Kalya- Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’ సన్నద్ధం అవుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. సినిమాల్లోకి రావడానికి ముందు పవన్ ఎలా అయితే సన్నద్ధమయ్యాడో అలానే పవర్ స్టార్ వారసుడు అకీరా కూడా సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే కత్తిసాము, కర్రసాము నేర్చుకోగా కొత్తగా కిక్ బాక్సింగ్ చేస్తూ కనిపించాడు.

నేడు అకీరా పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ ఈ వీడియోని షేర్ చేస్తూ, అకీరా తన కొడుకుగా ఆద్యాకు అన్నగానే కాదు, స్నేహితులకు గొప్ప ఫ్రెండ్ అని, ఔదార్యం కలిగిన జెంటిల్‌మెన్ అని తెలిపారు. ఇంతకీ, అకీరా ఎలాంటి కథతో రాబోతున్నాడు అని అందరికీ ఉన్న ఆసక్తి. కాగా ఆ మధ్య టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ‘నీరజ్ చోప్రా’ బయోపిక్ తీయాలని చాలామంది ప్లాన్ చేశారు.
ఆ విజేత ఆత్మ కథనే సినిమాగా తీయాలని సినిమా వాళ్ళు ఉత్సాహ పడుతున్నారు. ‘నీరజ్ చోప్రా’ కథ వింటే ఎవరిలోనైనా ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. అతని జీవితంలో గొప్ప పోరాటం ఉంది. చిన్న తనం నుండే.. అతను కాలంతో యుద్ధం చేశాడు. క్షణక్షణం తన పరిధిని పరిమితిని పెంచుకుంటూ పోయాడు.
అన్నిటికీ మించి మరెన్నో మలుపులు నీరజ్ జీవితంలో ఉన్నాయి. కష్టాలు అవమానాలు మధ్య అతను జీవితం సాగింది. అతను అనుభవించిన ప్రతి బాధను తన విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు నీరజ్ జీవితంలో ఉన్నాయి. అందుకే, అతని కథలో కల్పితాలు కలపక్కర్లేదు. ఉన్న నిజాన్ని ఉన్నట్టుగానే చెప్పినా.. అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అవుతుంది ఆ సినిమా.

అయితే, నీరజ్ ఫిజిక్, వయసుకు అతని బయోపిక్ లో కరెక్ట్ గా సరిపోయే కొత్త నటుడు అంటే ‘అకీరా నందన్’నే గుర్తుకువస్తున్నాడట. పైగా , ఫిజిక్ అండ్ ఏజ్ పరంగా అకీరా నందన్, నీరజ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. పైగా పవర్ స్టార్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’కి ఇంతకుమించిన గొప్ప కథ దొరకదు. మరి, పవన్ ఫ్యాన్స్ సంతోషం కోసమైనా ‘అకీరా నందన్’, నీరజ్ చోప్రా పాత్రలో నటిస్తాడేమో చూడాలి.