Kesari 2 : చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆయన కెరీర్ లో పెద్ద హిట్ గా నిల్చిన ‘కేసరి’ చిత్రానికి సీక్వెల్ గా ‘కేసరి : చాప్టర్ 2′(Kesari : Chapter 2) తెరకెక్కి ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైంది. జలియాన్ వాలా బాగ్ లో జరిగిన దుర్ఘటనలను ఆధారంగా తీసుకొని ఈ తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా కు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడని, చాలా కాలం తర్వాత ఒక సరైన బ్లాక్ బస్టర్ హిట్ ని ఆయన ఈ చిత్రం ద్వారా అందుకోబోతున్నాడని ట్రేడ్ విశ్లేషకులు ఆశించారు. కానీ ఓపెనింగ్ వసూళ్లు అంతగా రాలేదు. మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి కేవలం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
Also Read : బాక్స్ ఆఫీస్ వద్ద ‘కేసరి 2’ సెన్సేషన్..ఏకంగా రెండు రెట్లు పెరిగిన వసూళ్లు!
మొదటి రోజు రావాల్సిన వసూళ్లు, మూడు రోజులకు రావడం, అది కూడా పాజిటివ్ టాక్ తో అంటే చాలా దారుణం అనే చెప్పాలి. లాంగ్ రన్ లో అయితే బాగా ఆడుతుందేమో అని అనుకుంటే సోమవారం ఈ చిత్రానికి కేవలం 4 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ మంగళవారం రోజున ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘#BlockbusterTuesdays’ పేరిట నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో కేవలం 99 రూపాయలకు టికెట్ రేట్స్ పెట్టడం వల్ల ఈ చిత్రానికి వసూళ్లు పెరిగాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. మొత్తం మీద ఈ చిత్తానికి నాలుగు రోజుల్లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అక్షయ్ కుమార్ రేంజ్ కి, పాజిటివ్ టాక్ తో ఈ వసూళ్లు అంటే చిల్లరే అని అనుకోవచ్చు.
కానీ నేటి నుండి కూడా ఈ చిత్రం డీసెంట్ స్టడీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా వంద కోట్ల రూపాయల నెట్ వసూళ్లకు చాలా దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటే 200 కోట్ల గ్రాస్, లేదా డీసెంట్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటే 150 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎంత దూరం వెళ్తుంది అనేది. ఏది ఏమైనా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ ఉన్న అక్షయ్ కుమార్ కి ఈ చిత్రం సక్సెస్ మంచి బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి.
Also Read : ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?