Kesari 2 Collection: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్(Salman Khan) ‘సికిందర్'(Sikindar) చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, ఆ తర్వాత విడుదలైన ‘జాట్'(Jaat Movie) చిత్రం సర్ప్రైజ్ హిట్ గా నిలిచి వంద కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యం గా నార్త్ ఇండియా లో ఉన్న సింగల్ స్క్రీన్స్ అన్నీ ఈ సినిమా కారణంగా దద్దరిల్లిపోయాయి. ఈ చిత్రం విడుదలైన 8 రోజులకు అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన ‘కేసరి 2′(Kesari : Chapter 2) విడుదలైంది. మొదటి రోజు కేవలం 7 కోట్ల 90 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు ఏకంగా 10 కోట్ల 8 లక్షల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అంటే ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా రెండు రోజులకు కలిపి దాదాపుగా 18 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
Also Read: స్టార్ హీరోయిన్ కి సిమ్రాన్ కౌంటర్..అలాంటి రోల్స్ చేసే కర్మ నాకు లేదంటూ కామెంట్స్!
అన్ని వర్గాల నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజున 29 శాతం కలెక్షన్స్ పెరిగాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే వంటి సిటీస్ లో ఈ చిత్రం దంచికొట్టేసింది అని చెప్పొచ్చు. మూడవ రోజున ఈ చిత్రానికి గంటకు 15 వేలకు పైగా టికెట్స్ బుక్ మై షో ద్వారా అమ్ముడుపోతున్నాయి. దీనిని బట్టీ చూస్తే కచ్చితంగా మూడవ రోజున ఈ చిత్రం 15 నుండి 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతానికి ఈ చిత్రం మొదటి వీకెండ్ ‘జాట్’ తో సరిసమానంగా ఉండేలా ఉంది. కానీ లాంగ్ రన్ లో ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పే అవకాశం ఉంది. ఎందుకంటే కంటెంట్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి.
ముఖ్యంగా సిటీస్ లో ఈ చిత్రం సునామీ ని సృష్టించవచ్చు. బాలీవుడ్ లో ఒక సినిమాకు సంపూర్ణమైన పాజిటివ్ టాక్ వస్తే, కలెక్షన్స్ ఇప్పట్లో ఆగవు. చావా చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదలై ఇప్పటికీ థియేటర్స్ లో నడుస్తూనే ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు, బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు ఏ రేంజ్ లాంగ్ రన్ ఉంటుంది అనేది. ఈ సినిమాకు కూడా అదే రేంజ్ థియేట్రికల్ రన్ ఉండొచ్చు. సోమవారం రోజున ఈ సినిమాకు పది కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లు వస్తే, ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది. అక్షయ్ కుమార్ కి చాలా కాలం తర్వాత ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కావడంతో, కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న ‘పుష్ప’ డూప్..స్టార్ హీరోలు కూడా పనికిరారు!