Badri: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరికొత్త హీరోయిజం ని పరిచయం చేసిన చిత్రం ‘బద్రి'(Badri Movie). పూరి జగన్నాథ్(Puri Jagannath) కి ఇది మొట్టమొదటి సినిమా. తొలిప్రేమ ని చూసి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఎలా అయినా సినిమా చేయాలనే తపనతో ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ స్టోరీ ని వినిపించి, పవన్ కళ్యాణ్ కి ‘బద్రి’ సినిమా స్టోరీ ని వినిపించాడట పూరి జగన్నాథ్. కేవలం పది నిమిషాల సమయం ఇస్తాను, స్టోరీ చెప్పి వెళ్ళిపో అన్న పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండు గంటలకు పైగా స్టోరీ ని విన్నాడని, విని చాలా నచ్చాడని, కానీ క్లైమాక్స్ ని మార్చమని అడగ్గా, తానూ మార్చే ప్రయత్నం చేసి సంతృప్తి చెందకపోవడం మార్చలేకపోయానని పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Also Read: స్టార్ హీరోయిన్ కి సిమ్రాన్ కౌంటర్..అలాంటి రోల్స్ చేసే కర్మ నాకు లేదంటూ కామెంట్స్!
అప్పుడు పవన్ కళ్యాణ్ ‘నువ్వు క్లైమాక్స్ ని మార్చి ఉండుంటే నేను నీతో సినిమా చేసేవాదానిని కాదు, నువ్వు నమ్మిన దాని మీద నిలబడతావో లేదో అని చిన్న టెస్ట్ చేశా, సక్సెస్ అయ్యావ్, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పాడట. అలా మొదలైన బద్రి చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ మొదట్లో ఈ సినిమాకు అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. మొదటి వారం మొత్తం ఆ టాక్ మీదనే ఈ సినిమా రన్ అయ్యింది కానీ, కలెక్షన్స్ మాత్రం ఆరోజుల్లో కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయి. అప్పట్లోనే 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఆ రోజుల్లోనే నాలుగు సార్లు రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా ఒక సునామీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే సంధ్య 35 MM థియేటర్ లో ఈ చిత్రం 155 రోజులకు పైగా రన్ అయ్యింది. ఇది అప్పట్లో ఒక ఆల్ టైం రికార్డు అనొచ్చు. అదే విధంగా వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఈ చిత్రానికి డిస్ట్రిక్ట్ రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో విడుదలైన ప్రతీ సెంటర్ లో 50 రోజులు, వంద రోజులు ఆడిన ఏకైక సినిమా ఇదే. యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన ఈ సినిమా కేవలం ఒక్క సీడెడ్ ప్రాంతం లో మాత్రమే యావరేజ్ గా ఆడింది. అందుకే ఇండస్ట్రీ హిట్ అవ్వలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఈ సినిమాని మరోసారి రీ రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ పుట్టినరోజు కి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న ‘పుష్ప’ డూప్..స్టార్ హీరోలు కూడా పనికిరారు!