Hero Viswanath: కొన్ని సినిమాలను మనం బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాము, ఎన్ని సార్లు చూసిన బోర్ అనిపించని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చిత్రాలలో ఒకటి ‘కేరింత’ .ఇందులో సుమంత్ అశ్విన్ మెయిన్ హీరో గా నటించగా, విస్వంత్ మరో హీరో గా నటించాడు. అశ్విన్ క్యారక్టర్ కంటే కూడా అందరూ సిద్ (విస్వంత్) క్యారక్టర్ ని ఎక్కువగా ఇష్టపడ్డారు. 2015 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
అయితే ఇందులో సిద్ క్యారక్టర్ చేసిన విస్వంత్ భవిష్యత్తులో విజయ్ దేవరకొండ మరియు నిఖిల్ సిద్దార్థ లాగ క్రేజీ హీరో గా మారుతాడని అనుకున్నారు. కానీ చివరికి ఆయన ఇతర హీరోల సినిమాల్లో సెకండ్ హీరోగా మాత్రమే స్థిరపడ్డాడు.పలు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ ఎందుకో అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.
ఇది ఇలా ఉండగా గత ఏడాది ప్రారంభం లో ఈయన రోడ్ల మీద ‘రాపిడో’ బైక్ ని నడుపుతూ అందరిని షాక్ కి గురి చేసాడు. రాపిడో అంటే తెలిసిందే కదా,సిటీ క్యాబ్ సర్వీస్ ఎలాగో, రాపిడో ద్వారా బైక్ సర్వీస్ అలా అన్నమాట. ప్రయాణికులు ఆన్లైన్ యాప్ ద్వారా బైక్ ని బుక్ చేసుకుంటే వచ్చి పికప్ చేసుకొని ప్రయాణికులు ఎంచుకున్న చోటకి చేరుస్తూ ఉంటారు. ఈ బైక్ ద్వారా ఒక అమ్మాయిని డ్రాప్ చెయ్యడానికి వచ్చాడు విస్వంత్.
అయ్యో మంచి హీరో అవుతాడు అనుకుంటే ఇలా బైక్ డ్రైవర్ అయ్యాడేంటి అని సోషల్ మీడియా లో వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు ఫీల్ అయ్యారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఆయన ఆ రాపిడో బైక్ ని తీసుకున్నది తన మూవీ ప్రొమోషన్స్ కోసమట. ఆయన హీరో గా నటించిన ‘కథ వెనుక కథ’ అనే చిత్రం విడుదల సందర్భంగా ఇలా చేసి ప్రయాణికులకు చివర్లో తన ముఖం చూపించి సర్ప్రైజ్ కి గురి చేసాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.