Virupaksha Movie Kumar Role: సమ్మర్ కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘విరూపాక్ష’. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన చిత్రం ఇది. హారర్ థ్రిల్లర్ జానర్ లో ఇంత పర్ఫెక్ట్ సినిమాని థియేటర్ లో చూసి చాలా కాలమే అయ్యింది. థియేటర్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు థ్రిల్ కి గురయ్యారు. కొన్ని సన్నివేశాలకు అయితే ఆడియన్స్ గుండెలు జారీ ప్యాంట్ లోకి వచ్చినంత పని అయ్యింది.
సౌండ్ మిక్సింగ్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇలా ప్రతీ ఒక్క క్రాఫ్ట్ లో ఈ సినిమా ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంది.అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎన్ని కొత్త సినిమాలు విడుదలైనా, బాక్స్ ఆఫీస్ వద్ద విరూపాక్ష చిత్రం డామినేషన్ మాత్రమే కొనసాగుతుంది అంటే, ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత మనకి హీరో మరియు హీరోయిన్ తర్వాత గుర్తుకు వచ్చే క్యారక్టర్ ‘కుమార్’. ఈ పాత్రని ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్/ బిగ్ బాస్ ఫేమ్ రవి చేసాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టులు కూడా ఎవ్వరూ ఊహించనిది. ఆడియన్స్ ని ఇతగాడు భయపెట్టిన తీరు అద్భుతం, ఈ చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆయనకీ ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఈ పాత్ర కోసం ముందుగా రవి ని కాకుండా, ‘c/o కంచరపాళెం’ సినిమాలో హీరోగా నటించిన ‘కార్తీక్ రత్నం’ ని సంప్రదించారట. కానీ ఆయన అదే సమయం లో మరో సినిమాకి కమిట్ అయ్యి ఉండడం వల్ల ఈ చిత్రం లో నటించలేకపోయాడట. ఈ విషయాన్నీ స్వయంగా రవి నే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.