Keerthy Suresh’s sister : బ్రేకింగ్ న్యూస్… సినిమాల్లోకి కీర్తి సురేష్ అక్క!

పెళ్ళైన ఇన్నేళ్లకు రేవతి సురేష్ డైరెక్టర్ గా మారారు. ఆమె దర్శకత్వంలో థాంక్ యూ టైటిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్ మే 27న కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రేవతి త్వరలో పూర్తి స్థాయిలో డైరెక్టర్ గా మారనున్నారని ప్రచారం జరుగుతుంది.

Written By: NARESH, Updated On : May 27, 2023 6:01 pm
Follow us on

Keerthy Suresh’s sister : స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ వెలిగిపోతుండగా ఆమె అక్క రేవతి సురేష్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆమె హీరోయిన్ గా కాదు. దర్శకురాలిగా. కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు కీర్తి సురేష్. పెద్దమ్మాయి పేరు రేవతి. ఈమెకు 2016లో నితిన్ మోహన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కాగా రేవతి ది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ చికాగో నందు ఫిల్మ్ అండ్ అనిమేషన్ లో కోర్స్ చేశారు.

పెళ్ళైన ఇన్నేళ్లకు రేవతి సురేష్ డైరెక్టర్ గా మారారు. ఆమె దర్శకత్వంలో థాంక్ యూ టైటిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్ మే 27న కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రేవతి త్వరలో పూర్తి స్థాయిలో డైరెక్టర్ గా మారనున్నారని ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ కూతురైన రేవతి హీరోయిన్ కాకుండా డైరెక్టర్ కావాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె ప్రయత్నం సక్సెస్ కావాలని కీర్తి సురేష్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక చెల్లి కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి దున్నేస్తుంది. ఏకంగా నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. మహానటి చిత్రానికి గానూ కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుపొందారు. తెలుగులో కీర్తికి మహానటి బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ దెబ్బతో ఆమె ఫేట్ మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అలాగే స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తున్నారు.

తెలుగులో కీర్తి నటించిన సర్కారు వారి పాట, దసరా మంచి విజయాలు సాధించాయి. కమర్షియల్ హిట్స్ లేక అల్లాడుతున్న ఆమె దాహం ఈ చిత్రాలు తీర్చాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేయడం కొసమెరుపు. స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న వారెవరూ చెల్లి పాత్రలు చేయరు. కీర్తి మాత్రం తాను ప్రత్యేకమని నిరూపించుకుంది.