
‘నేను శైలజ’ మూవీతో కీర్తి సురేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. రామ్ పోతినేనికి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో కీర్తీ సురేష్ కు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. నానితో ‘నేను లోకల్’, నాగ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి బయోపిక్ చిత్రం ‘మహానటి’లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతోపాటు తమిళంలో అగ్రహీరోల సరసన నటించి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా మారింది.‘మహానటి’తో కీర్తీ సురేష్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాతతరం నటి ‘సావిత్రి’ క్యారెక్టర్లో ఆమె చేసిన నటనకు ప్రతీఒక్కరూ ఫిదా అయ్యారు. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆమె నటనగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు అందించి సత్కరించింది.
కీర్తీ సురేష్ తమిళ సినిమాలతో బీజీగా మారడంతో తెలుగులో గెస్ట్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది. ఇటీవల ‘మన్మథుడు-2’లో కింగ్ నాగార్జున సరసన ఓ అతిథి పాత్రలో కన్పించింది. పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతున్న ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’ లాక్డౌన్ ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో కీర్తీ సురేష్ నటించిన ‘పెంగ్విన్’ ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. ‘పెంగ్విన్’ మూవీని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ తెరక్కించారు. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ జూన్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.