Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh: మెడలో తాళి ఏది? కీర్తి సురేష్ కొత్త ఫోటోలపై సోషల్ మీడియాలో అతిపెద్ద...

Keerthy Suresh: మెడలో తాళి ఏది? కీర్తి సురేష్ కొత్త ఫోటోలపై సోషల్ మీడియాలో అతిపెద్ద చర్చ.. ఇంతకీ ఏమైంది?

Keerthy Suresh: హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టింది. అనంతరం హీరోయిన్ గా మారి స్టార్ హోదా రాబట్టింది. కీర్తి సురేష్ కెరీర్ ని మహానటికి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మహానటి.. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం అందుకుంది. సావిత్రి పాత్రలో అద్భుతం చేసిన కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు దక్కింది. మహానటి అనంతరం కీర్తి సురేష్ కి ఆఫర్స్ క్యూ కట్టాయి.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సరసన కమర్షియల్ చిత్రాలు చేస్తుంది. కాగా కీర్తి సురేష్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్ భర్త పేరు ఆంటోని తట్టిల్. వీరిద్దరూ 15 ఏళ్లకు పైగా రిలేషన్ లో ఉన్నారట. ఆంటోని వ్యాపారవేత్త. 2024 డిసెంబర్ 12న కీర్తి వివాహం జరిగింది. అదే నెల 25న బేబీ జాన్ విడుదలైంది. బేబీ జాన్ కీర్తి సురేష్ నటించిన మొదటి హిందీ చిత్రం. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. తమిళ హిట్ మూవీ తేరి రీమేక్.

బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని భావించిన కీర్తి సురేష్ ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడ్డారు. హనీ మూన్ కూడా పక్కన పెట్టి, బేబీ జాన్ ప్రమోషన్స్ కి టైం కేటాయించింది. బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ మెడలోని తాళిబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మందంగా ఉన్న ఆ పసుపు తాడు మోడ్రన్ డ్రెస్ లో ఉన్న కీర్తి సురేష్ మెడలో సపరేట్ గా కనిపించేది. దాంతో అప్పట్లో ఈ విషయాన్ని మీడియా ప్రధానంగా హైలెట్ అయ్యింది.

కాగా తాజా ఫోటోల్లో కీర్తి సురేష్ తాళి లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళై రెండు నెలలు కాలేదు. అప్పుడే తాళి తీసి మెడలో పెట్టేశావా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ కెరీర్ పరిశీలిస్తే.. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.

Exit mobile version