Keerthy Suresh
Keerthy Suresh : ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఏకైక నటి ఆమె. యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఎంత మంచి క్రేజ్ ఉందో, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ లోను అదే రేంజ్ క్రేజ్ ఉంది. కానీ ఈమధ్య కాలం లో కీర్తి సురేష్ చేస్తున్న ప్రతీ సినిమా ఫ్లాపులు అవుతూ వస్తున్నాయి. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం గమనించాల్సిన విషయం. ఇదంతా పక్కన పెడితే గత ఏడాది డిసెంబర్ 14 న ఆంటోనీ అనే వ్యక్తిని కీర్తి సురేష్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. స్కూల్ డేస్ నుండి కీర్తి సురేష్ కి ఆంటోనీ అంటే పరిచయం ఉంది. పెళ్ళికి ముందు వీళ్లిద్దరు 15 ఏళ్ళ పాటు డేటింగ్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం.
Also Read : పెళ్లైన మూడు నెలలకే సంచలన ప్రకటన చేసిన కీర్తి సురేష్..అభిమానులకు ఊహించని షాక్!
వీళ్ళ పెళ్లి అనూహ్యంగా హిందూ సంప్రదాయంలో ఒకసారి, అదే విధంగా క్రిస్టియన్ సంప్రదాయం లో మరోసారి జరగడం విశేషం. కీర్తి సురేష్ ఇప్పటికీ తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈమెకు, ఆంటోనీ కి మధ్య 7 ఏళ్ళ తేడా ఉందని, కీర్తి సురేష్ వయస్సులో ఆంటోనీ కంటే పెద్దది అని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. అయితే ఇద్దరి మధ్య 7 ఏళ్ళు గ్యాప్ ఉన్న విషయం వాస్తవమే. కానీ కీర్తి సురేష్ చిన్నది అని తెలుస్తుంది. కీర్తి సురేష్ వయస్సు ప్రస్తుతానికి 32 ఏళ్ళు. ఆంటోనీ వయస్సు 39 ఏళ్ళు. ఇంత వయస్సు తేడా ఉన్నవాళ్లు స్కూల్ డేస్ నుండి ఎలా స్నేహితులు అయ్యారు అనేది మిస్టరీ. ఈ లవ్ స్టోరీ గురించి కీర్తి సురేష్ నోరు విప్పితే కానీ ఎవరికీ అర్థం కాదు.
ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే, పెళ్లి తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేది’ వంటి రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఆమె అక్కా అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం రాధికా ఆప్టే కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీటి మీదనే ఆమె కోటి ఆశలు పెట్ట్టుకుంది. ‘దసరా’ చిత్రం తర్వాత ఆరు సినిమాలు చేస్తే, అన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఒక హీరోయిన్ కి వరుస ఫ్లాప్స్ రావడం మంచిది కాదు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.
Also Read : పెళ్ళైన రెండు నెలలకే భర్తకు కోలుకోలేని షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..ఇలా అయితే కష్టమే!