steel Fans
Round Steel Wheels: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీంతో కొన్ని కష్టమైన పనులను సాంకేతిక ద్వారా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు వ్యవసాయానికి సంబంధించిన అనేక రంగాల్లో టెక్నాలజీ ఇప్పటికే చొచ్చుకు వచ్చింది. అయితే కేవలం పనులను పూర్తి చేయడానికి మాత్రమే కాకుండా కార్మికులు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఫ్యాక్టరీల్లో ఈమధ్య కొన్నింటిని అమరుస్తున్నారు. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు లేదా ఫ్యాక్టరీని చూసినప్పుడు పైన స్టీల్ లోహంతో ఉన్న గుండ్రటి చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇవి నిత్యం తిరుగుతూ ఉండడం వల్ల.. వీటిని ఎందుకు అమర్చారు? అని సందేహం చాలా మందికి వచ్చింది. కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీటిని అమరచడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా కర్మగారాలను రేకులతో కప్పబడిన షెడ్డు లాంటివి నిర్మిస్తూ ఉంటారు. ఈమధ్య కొన్ని షాపింగ్ మాల్స్.. ఇతర ఉత్పత్తి సంస్థలు.. ఇతర సంస్థలు కూడా రేకులతో కప్పబడిన షెడ్డులను నిర్మించుకుంటున్నారు. అయితే ఇవి తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్న.. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగిస్తాయి. దీంతో ఇందులో పని చేసేవారు చాలా ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇందులోని వేడిని బయటకు తీసేయాలంటే ఏసీలను ఏర్పాటు చేసుకోవాల్సిందే. కానీ కొన్ని కర్మాగారాల్లో ఏసీలను ఏర్పాటు చేసే అవకాశం ఉండదు.
దీంతో ఉష్ణోగ్రతను బయటకు తీయడానికి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. టర్బో వెంటిలేటర్.. అనే పేరు కలిగిన ఇవి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కలయికతో తయారయ్యాయి. ఇవి సైన్స్ సూత్రం ప్రకారం పనిచేస్తాయి. అంటే చల్లగాలి కంటే వేడి గాలి తేలికైనది. వేడి కాలనీ బయటకు తీసేయడానికి ఏదైనా వస్తువును ఉపయోగించుకోవచ్చు. అలా ఈ టర్బో వెంటినేటర్లను ఉపయోగించి వేడి కాలనీ బయటకు తీసేస్తుంటారు. ఇవి షెడ్యూల్ పైన ఏర్పాటు చేస్తారు. ఇవి గాలికి తిరుగుతూ షెడ్ లోపల ఉన్న వేడి గాలిని పీల్చుకొని బయటకు పంపిస్తాయి. అలాగే లోపల ఉన్న దుర్వాసనను, తేమను కూడా తొలగించడంలో ఉపయోగపడతాయి.
అయితే ఈ స్టీల్ ఫ్యాన్లు చూసి చాలామంది అలంకరణ కోసం వేశారని అనుకుంటున్నారు. కానీ ఇవి ఆరోగ్య ప్రయోజనాల కోసమేనని తెలుసుకోవాలి. ఇలా కర్మాకారాలలో ఉన్న వేడి గాలిని బయటకు తీసేయడం వల్ల లోపల పనిచేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటిని కేవలం కర్మకారాలలో మాత్రమే కాకుండా షాపింగ్ మాల్స్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్లు లేదా ఇతర సంస్థల్లో రేకుల షెడ్డుతో కప్పబడిన షెడ్యూల్లో ఏర్పాటు చేసి వేడి కాలనీ తీసేస్తున్నారు. వర్షాకాలంలోనూ ఇవి తిరుగుతూ ఉండటం వల్ల లోపల ఉన్న తేమంతా బయటకు పోయి లోపల స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండగలుగుతారని వీటిని ఏర్పాటు చేసిన వారు చెబుతున్నారు.