Keerthy Suresh : నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్ల జాబితా తీస్తే అందులో కీర్తి సురేష్(Keerthy Suresh) పేరు ముందు వరుసలో ఉంటుంది. నేటి తరం హీరోయిన్స్ లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక నటి ఆమె. కేవలం అందంతోనే కాదు, నటన తో , డాన్స్ తో ప్రేక్షకులను మైమరచిపోయేలా చేయడంలో కీర్తి సురేష్ దిట్ట. అందుకే ఈమె అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమెలో ఇంత టాలెంట్ ఉందని, ఈ స్థాయికి ఎదుగుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. ‘మహానటి’ చిత్రం విడుదలకు ముందు కూడా కీర్తి సురేష్ ని యావరేజ్ హీరోయిన్ క్యాటగిరీలోనే ఉంచేవారు. ఎప్పుడైతే ‘మహానటి’ చిత్రం వచ్చిందో ఆమె ప్రతిభ మొత్తం బయటపడింది. నేటి తరం హీరోయిన్స్ ఎవ్వరూ ఈ రేంజ్ లో నటించలేరని ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు.
Also Read : పెళ్లి చేసుకోమని ఆ స్టార్ డైరెక్టర్ కీర్తి సురేష్ ని అంతలా ఇబ్బంది పెట్టాడా? చివరికి ఏమైందంటే!
అప్పటి నుండి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ ముందుకెళ్లిన కీర్తి సురేష్, కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్లి సంబంధించిన ఫోటోలను ప్రతీ రోజు నాన్ స్టాప్ గా ఆపకుండా నిన్న మొన్నటి వరకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూనే ఉన్నింది కీర్తి సురేష్. ఇటీవలే హనీమూన్ కి కూడా తన భర్త కలిసి వెళ్ళొచ్చింది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ ఇక సినిమాలకు దూరం అవుతుందేమో, ఇక సినిమాలు చేయదేమో అని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ పెళ్లైన మూడు నెలలకే ఆమె కొత్త సినిమాని ఒప్పుకొని అభిమానులకు కూల్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేసింది. కోలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అశోక్ సెల్వన్ కు జంటగా ఆమె హీరోయిన్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమా సంకాంతి పక్కన పెడితే పెళ్ళికి ముందే ఆమె నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తో పాటు ఆమె రివాల్వర్ రీటా, కన్నివేది వంటి చిత్రాలను చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో కీర్తి సురేష్ కి సరైన కమర్షియల్ హిట్ లేదు. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో చేసిన ‘దసరా’ తర్వాత ఆమె చిరంజీవి తో ‘భోళా శంకర్’ చేసి ఘోరమైన పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా పెళ్లి తర్వాత ఆమె నుండి విడుదలైన బాలీవుడ్ చిత్రం బేబీ జాన్ కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె స్క్రిప్ట్ విషయాల్లో జాగ్రత్త పడింది, రాబోయే సినిమాలు అభిమానులను ఎంతమేరకు అలరిస్తాయో చూడాలి.
Also : నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!