తెలుగు చిత్ర పరిశ్రమకు సీఎం కేసీఆర్ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే కరోనా కేసులు పెరుగుతుండడం.. హైకోర్టు తాజాగా పాఠశాలలకు సెలవులు ఇచ్చి బార్లు, వైన్స్, సినిమా హాళ్లు తెరవడం పై సీరియస్ అయ్యింది. దీంతో తెలంగాణలో మళ్లీ ఆంక్షలు పెడుతారా? ఈ మేరకు హైకోర్టుకు నివేదిస్తారా? అన్న టెన్షన్ టాలీవుడ్ కు ఉంది.ఏప్రిల్ 16 నుంచి నిషేధాజ్ఞలు అమలు అవుతాయని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్ లో ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టి కరోనా కల్లోలంలోనూ సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు సినిమా థియేటర్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్న అది నిర్మాతలకు తీవ్ర నష్టం. మళ్లీ సినీ పరిశ్రమ కుప్పకూలుతుంది.
అందుకే సినీ పరిశ్రమ తాజాగా సీఎం కేసీఆర్ ను కలువబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి లాక్ డౌన్ సహా 50శాతం అక్యుపెన్సీని పెట్టొద్దని కోరనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16నుంచి థియేటర్లలో 50శాతం అక్యూపెన్సీ పెట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో మినహాయింపులు ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలు కేసీఆర్ ను కోరున్నారు. ఈ వీకెండ్ లో ‘వకీల్ సాబ్’ మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత ‘లవ్ స్టోరీ’ విడుదలకు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే మున్ముందు సినిమాలకు ఇబ్బందులు కలుగకుండా టాలీవుడ్ పెద్దలు కేసీఆర్ ను కలిసి ఫ్రీగా వదిలేయాలని కోరనున్నారు.
దీనిపై కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? టాలీవుడ్ కు ఊరటనిస్తాడా? లేదా ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా? అన్నది ఆసక్తిగా మారింది.