KCR Comments On The Kashmir Files: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలీవుడ్‌లో విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్‌లను రాబడుతోంది. అయితే ఈ మూవీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. కాశ్మీర్‌లో హిందూ పండిట్‌లను హత్య చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని కేసీఆర్ ఆరోపించారు.
దేశంలో రైతు సమస్యలను పక్కదోవ పట్టించడానికి బీజేపీ కాశ్మీర్ ఫైల్స్ సినిమాను వాడుకుంటోందని కేసీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ఫైల్స్ సినిమాను వదిలిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని హితవు పలికారు. దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదని.. డెవలప్‌మెంట్ ఫైల్స్ అని కేసీఆర్ సూచించారు.
Also Read: Mohan Babu: ‘సిరివెన్నెల’ను చూడడానికి ఎవరిని వెళ్లొద్దన్నా.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను ఈ సమయంలో విడుదల చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత కొంతమంది రెచ్చిపోతూ దాడులకు పాల్పడుతున్న కూడా వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. కేవలం రూ.12 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా దేశవ్యాప్తంగా చాలామంది నేతలకు ఈ సినిమా తెగ నచ్చింది. ఇటీవల ఈ మూవీ ఆనాటి గాయాలను మాన్పుతుందా? తిరిగి రేపుతుందా? అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ మాట్లాడారు.
Also Read: BJP vs KCR : కేసీఆర్ ముందరి కాళ్లకు ముందే బంధం వేసిన బీజేపీ
Recommended Video: