Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రస్తుతం ఒక టాపిక్ తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె తన పెళ్లి పై నిర్ణయం తీసుకుంది. ఇంతకీ పెళ్లి ఎవరితో అంటే.. హీరో విక్కీ కౌశల్ తో. పైగా విక్కీ కౌశల్ – కత్రినా గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో పడి మునుగుతూ తేలుతూ ఉన్నారు. అయితే, తాజా నివేదికల ప్రకారం ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.

వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోతున్నాయి. వీళ్ళు మాత్రం తమ పెళ్లి వార్తను చాలా రహస్యంగా ఉంచుతున్నారు. పైగా అందుకే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఎవరికీ పంపే ఆలోచనలో లేరట. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే.. డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు.
కాకపోతే తమ పెళ్లి గురించి ఎక్కడా బయటకు పొక్కకుండా ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ప్లాన్డ్ గా పెళ్లికి సిద్ధం అవుతున్నారు. అందుకే వివాహ ఆహ్వానాలు కూడా ఇంకా సన్నిహితులకు కూడా పంపలేదు. పెళ్ళికి నాలుగు రోజులు ముందు పంపుతారట. అది కూడా కొందరికి మాత్రమే. ఏది ఏమైనా తన వ్యక్తిగత జీవితం విషయాల పై కత్రినా ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటుంది .
ఇక తమకు కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి స్టార్ హీరో రణబీర్ కపూర్, కత్రినాకి హ్యాండిచ్చి ఆమెను వదిలేసిన తర్వాత, ఒంటరితనంతో కత్రినా చాలా బాధ పడింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది.
అయితే, విక్కీ కౌశల్ కి 33 ఏళ్ళు. అదే కత్రినాకి 38 ఏళ్ళు. అంటే ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది లేండి. ప్రస్తుతానికి అయితే, కత్రినా, విక్కీ కౌశల్ ప్రేమలో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. కాకపోతే కత్రినా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగానే ఉంటుందని ఒక టాక్ ఉంది.
Also Read: Actor Surya: పునీత్ సమాధి వద్ద హీరో సూర్య ఏం చేశాడో తెలుసా…