katrina kaif: బాలీవుడ్ లో ప్రేమ జంటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. కానీ చివరికి ఆ జంట కొన్ని సమస్యల వల్ల విడిపోతున్నట్లు ప్రకటిస్తారు. అలా బాలీవుడ్ లో చాలా జంటలు చేశాయి. మాధురి దీక్షిత్ సంజయ్ ద త్,దీపికా రణబీర్ ,షాహిద్ కరీనా, తదితర జంటలు ఇలానే చేశాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రేమ జంటలు కూడా వివాహాలు చేసుకున్నారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం చేస్తూ విక్కీ కత్రినా త్వరలో వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. వాటన్నిటిని నిజం చేస్తున్నారు కత్రినా కైఫ్ విక్కీ కౌశల్.

ఉత్తరాదిన రోకా’ ఫంక్షన్ ఆచారం ఉంటుందట ఈ ఆచారం ఏమిటంటే నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం,విందు వంటి విషయాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి మాట్లాడుకునే ఫంక్షన్” రోకా” ,.దీపావళి రోజున దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగిందట.
అయితే కత్రినా కబీర్ ను సోదరుడిలా భావిస్తారట రోకా వేడుకను ఆయన ఇంటిలోనే చేసుకున్నారట ఈ జంట.
డిసెంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ వివాహం జరగనుంది ఈ వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారట ఈ జంట. ప్రస్తుతం కత్రినా కైఫ్ ” ఫోన్ భూత్”,విక్కీ కౌశల్ “ది గ్రేట్ ఇండియన్ ఫామిలీ” తదితర చిత్రాల్లో బిజీగా ఉన్నారు.