Katrina Kaif: సినిమా వాళ్లకు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఏదైనా వ్యాపారమే. అది ఎమోషన్ అయినా, లేక కార్యమైనా.. అంతా బిజినెసే. జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన కార్యం. అలాంటి ముఖ్యమైన కార్యాన్ని ఎవరు వ్యాపారంగా భావించరు. కానీ, హీరోయిన్లకు అది కూడా బిజినెసే. మెయిన్ గా బాలీవుడ్ లో ఇలాంటి వ్యాపారాల కథే వేరు. నిజంగానే అక్కడ దేన్నయినా సరే ప్రచారంగా, వ్యాపారంగా చూస్తారు.

కాకపోతే, ఆఖరికి పెళ్లిని కూడా వ్యాపారంగా మార్చుకుని డబ్బులు వసూలు చేస్తేనే.. వినేవాళ్ళకు కాస్త అది ఇబ్బందిగా ఉంటుంది. అయినా డబ్బు కోసం అలాంటి ఎన్నో రకాల ఇబ్బందులను దాటుకుని వచ్చాం, ఇక మాకేం ఇబ్బంది అంటారు సదురు హీరోయిన్లు. ఇక ఈ బిజినెస్ లో కూడా రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. హీరోయిన్ ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుంటే.. ఆ పెళ్లికి పెద్దగా డిమాండ్ ఉండదు.
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అదే సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఇక ఆ పెళ్ళికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. విపరీతమైన మైలేజీ వస్తోంది. ప్రస్తుతం ముదురు హీరోయిన్ కత్రినా కైఫ్ – కుర్ర హీరో విక్కీల పెళ్లి విషయంలో మంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
వీరి పెళ్లి ఈ నెల 9న రాజస్థాన్‌లో జరగనుంది. బాలీవుడ్ హీరోహీరోయిన్లు అంతా ఇప్పుడు వీరి పెళ్లిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రాజస్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి ఘనంగా జరుగుతుంది. 400 మంది సినీ – రాజకీయ ప్రముఖులు వీరి పెళ్ళికి హాజరు కాబోతున్నారు. ఏ రకంగా చూసుకున్న టీవీలకు టీఆర్పీ రేటింగ్ లను పెంచే స్టఫ్ ఉన్న పెళ్లి ఇది.
అందుకే, ఓ ఓటీటీ కంపెనీకి అక్షరాలా వంద కోట్లకు ఈ పెళ్లికి సంబంధించిన సమస్త ఫుటేజీనీ కత్రినా జంట చక్కగా అమ్మేసుకుంది. గతంలో ఏ హీరోయిన్ పెళ్లి ఫుటేజ్ వంద కోట్లకు అమ్ముడుపోలేదు. పైగా ఓ ఓటీటీ సంస్థ ఈ పెళ్లి లైవ్ కోసం వంద కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా ఆశ్చర్యకరమే.