చికిత్సకి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ రోజు ఉదయం ఒక్కసారిగా విషయమించింది. దాంతో వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. క్రిటిక్ గా నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో కత్తి మహేష్ ఇక లేరు అనేసరికి ఆయన సినీ సన్నిహితులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
అసలు కత్తి మహేష్ కి ప్రమాదం ఎలా జరిగింది అంటే.. నెల్లూరు జిల్లాలో తన బంధువుల ఇంటికి వెళ్తూ ఉండగా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురి అయింది. అతి వేగంతో వెళ్తున్న ఆయన కారు నేరుగా వెళ్లి లారీని ఢీకొట్టింది. దాంతో కత్తి మహేశ్ కారుకి తీవ్ర ప్రమాదం జరిగి.. చివరకు ఆయన తన ప్రాణాలనే పోగొట్టుకున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున క్రిటిక్ కత్తి మహేష్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.