Actress Kasturi: ఒక్క ఆఫర్ కెరీర్నే మార్చేస్తుంది. అలాంటి ఆఫర్ గుమ్మం ముందు వరకూ వచ్చి చేజారితే ఆ బాధ వర్ణనాతీతం. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరికి బంపర్ ఆఫర్ తృటిలో చేజారిందట. ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఏకంగా బికినీ ఫోటోలు పంపితే, దర్శకుడు మాత్రం చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టాడట. విషయంలోకి వెళితే… 1996లో విడుదలైన భారతీయుడు ఒక సంచలనం.
ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కస్తూరి ఆడిషన్స్ చేసిందట. డైరెక్టర్ శంకర్ కి బికినీ ఫోటోలు పంపిందట. అదే సమయంలో రంగీలా మూవీలో నటించిన ఊర్మిళ మాటొక్డర్ దేశాన్ని ఊపేసింది. ఆమె బికినీ ఫోటోలకు భారీ స్పందన దక్కింది. దానితో ఊర్మిళను హీరోయిన్ గా ఎంపిక చేశాడట. దాంతో కస్తూరికి కమల్ హాసన్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ మిస్ అయ్యిందట. ఊర్మిళకు శంకర్ భారతీయుడు చిత్రంలో చెల్లి పాత్ర ఇచ్చాడు.
భారతీయుడు మూవీలో హీరోయిన్ రోల్ మిస్ అయినందుకు చాల బాధ వేసిందని కస్తూరి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. భారతీయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అన్ని భాషల్లో విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ మనీషా కొయిరాల. సెకండ్ హీరోయిన్ ఊర్మిళ. కస్తూరి చెల్లి పాత్ర చేసింది.
కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఆమెది. అగ్నిప్రమాదంలో చిక్కికున్న కస్తూరిని కాపాడుకునేందుకు తండ్రి కమల్ హాసన్ విశ్వ ప్రయత్నం చేస్తాడు. లంచం ఇస్తేనే పని చేస్తాం అని అధికారులు ఆమె ప్రాణాలు తీసేస్తారు. ఆ సంఘటన తర్వాత ఒకప్పటి ఫ్రీడమ్ ఫైటర్ కమల్ హాసన్ మరలా యుద్ధం మొదలుపెడతాడు. అవినీతి అధికారులను చంపేస్తూ ఉంటాడు. శంకర్ ని ఓ సందర్భంలో మీరు చెల్లి పాత్ర ఇచ్చి మోసం చేశారని అడగ్గా… అది కథలో కీలకమైన రోల్ అని శంకర్ తప్పుకున్నాడట.