Karuppu 11 Days Collections: ‘ తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు సునామీ ఎలాంటిదో ప్రతీ రోజు మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. 14 ఏళ్ళ నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, ఈ ఒక్క సినిమాతో ఈ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయిపోతున్న రోజులివి, అలాంటిది 2 వ సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది అనేది. 11 రోజుల థియేట్రికల్ రన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 11 రోజుల్లో 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో 150 కోట్ల గ్రాస్ ని కచ్చితంగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 26 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 18 కోట్ల 55 లక్షలు , కేరళ నుండి 11 కోట్ల 50 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 75 లక్షలు , ఓవర్సీస్ నుండి 67 కోట్ల 45 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 246 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 118 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 71 కోట్ల రూపాయలకు జరగ్గా, 47 కోట్ల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇక తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చిత్రానికి విడుదలకు ముందు 7 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 5 కోట్ల 75 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలను ఈ చిత్రం రాబట్టబోతుందో చూడాలి.
