సినిమా ప్లాప్ అయితే ఇక అంతే. ఆ హీరోతో ఏ కాంబినేషన్ ముందుకు వెళ్ళదు, అలాగే వచ్చిన అవకాశాలు, చేయవలసిన పాత్రలు కూడా క్యాన్సల్ అయిపోయాయని వినాల్సి వస్తోంది. దీనికి వాళ్లు ఎవరైనా సరే… ఎవరూ అతీతులు కాదు. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు హీరో కార్తికేయ. కాకపోతే ప్రస్తుతానికి కార్తికేయ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
కాకపోతే ఈ మూడు సినిమాలు కరోనాకి ముందు ఓకే అయ్యాయి. అంటే దాదాపు రెండు ఏళ్ల క్రితం ఒప్పుకున్న సినిమాలు తప్ప, కొత్తగా ఈ హీరోకి ఏ సినిమా రాలేదు. నిజానికి ‘చావు కబురు చల్లగా’ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని బాగా హోప్స్ పెట్టుకున్నాడు, అందుకే, తనకు వచ్చే మార్కెట్ ను తానూ క్యాష్ చేసుకోవాలని వచ్చిన ఛాన్స్ లను కూడా వదులుకున్నాడు కార్తికేయ.
చివరకు కార్తికేయ ఎంత ఉబలాట పడినా.. ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలై డిజాస్టర్ అయింది. దాంతో సహజంగానే కార్తికేయకు క్రేజీ ఆఫర్స్ రావడం ఆగిపోయాయి. దాంతో కార్తికేయ కెరీర్ ఆ సినిమా విడుదలకు ముందు ఉన్న హడావిడి, విడుదల తరువాత లేకుండా పోయింది. మొత్తానికి కార్తికేయకి అర్జెంట్ గా మంచి క్రేజ్ ఉన్న సినిమా కావాలి.
లేకపోతే ఇక హీరోగా నిలబడటం కష్టం అవుతుంది. అసలుకే అజిత్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దీంతో కార్తికేయ హీరోగా చేసే తన తరువాత సినిమాల పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఒక డైరెక్టర్ కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు, ఈ క్రమంలో జాతి రత్నాలు దర్శకుడితో ఒక సినిమా చేయాలని కార్తికేయ ట్రై చేస్తున్నాడు. మరి ఈ కలయికలో సినిమా వస్తోందా !