https://oktelugu.com/

Kartika Deepam Doctor Babu : కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కార్తీక దీపం డాక్టర్ బాబు… వాళ్ళ అబ్బాయిని చూశారా? (టీవీ)

ప్రస్తుతం ఆయన స్టార్ మాలో కార్తీకదీపం 2 చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన సమయంలో నిరుపమ్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మళ్లీ కార్తీకదీపం సీక్వెల్ లో కార్తీక్ గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2024 / 08:21 PM IST

    nirupam manjula

    Follow us on

    Kartika Deepam Doctor Babu : సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. కార్తీక దీపం లో ఆయన చేసిన డాక్టర్ బాబు పాత్ర ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది. నిరుపమ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నిరుపమ్ భార్య మంజుల కాగా.. ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వాళ్లకి సంబంధించిన ప్రతి విషయంలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.

    కాగా ఇటీవల నిరుపమ్ కొత్త ఇల్లు కొన్నారు. గృహ ప్రవేశం కూడా చేశాడు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు భార్య మంజుల షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోల్లో నిరుపమ్ కొడుకు కూడా ఉన్నాడు. నిరుపమ్ శ్రీరామ నవమి పండుగ రోజున తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి భార్య మంజులతో కలిసి శ్రీరామ నవమి పండుగ రోజున గృహప్రవేశం చేశారు. పండగ పర్వదినాన కొత్త ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తోంది.

    దీంతో అభిమానులు నిరుపమ్ – మంజులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మీరు సంతోషంగా ఉండాలి, మరింత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. నిరుపమ్ – మంజుల చంద్రముఖి సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడిన జంట అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్య నిరుపమ్ ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించడం విశేషం.

    ప్రస్తుతం ఆయన స్టార్ మాలో కార్తీకదీపం 2 చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన సమయంలో నిరుపమ్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మళ్లీ కార్తీకదీపం సీక్వెల్ లో కార్తీక్ గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. అలాగే స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు షోల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో అవకాశం వస్తే ఆలోచిస్తానని .. ఖచ్చితంగా వెళ్ళాలనే కోరికైతే లేదని ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ క్లారిటీ ఇచ్చారు.