https://oktelugu.com/

OTT Release : ఈవారం ఓటీటీలో మూడు క్రేజీ థ్రిల్లర్స్… అసలు మిస్ అవ్వొద్దు!

కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సైరెన్. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి అనగా ఏప్రిల్ 19 నుంచి సైరెన్ చిత్రాన్ని హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2024 / 08:14 PM IST

    OTT Release

    Follow us on

    OTT Release : వీకెండ్ వస్తుందంటే సినిమా లవర్స్ కి పండగే. థియేటర్స్ లో రిలీజ్లు ఉన్నా లేకున్నా ఓటీటీలో లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు సిద్ధం అవుతున్నాయి. ఈ వారం మూడు క్రైమ్ థ్రిల్లర్స్, ఒక కామెడీ మూవీ అందుబాటులోకి వచ్చింది. అవేమిటో? ఎక్కడ చుడొచ్చో తెలుసుకుందాం?. అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించిన కామెడీ చిత్రం మై డియర్ దొంగ. ఏప్రిల్ 19 నుండి ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. దొంగ గా ఇంట్లోకి వెళ్లి ప్రేమికుడిగా మారిన వ్యక్తి కథే ఈ మై డియర్ దొంగ మూవీ.

    కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సైరెన్. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి అనగా ఏప్రిల్ 19 నుంచి సైరెన్ చిత్రాన్ని హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో కీర్తి సురేష్ పోలీస్ రోల్ చేయడం విశేషం. చేయని నేరానికి 14 ఏళ్ళు జైలు శిక్షణ అనుభవించిన వ్యక్తి కథే సైరెన్.

    తమిళ థ్రిల్లర్ రణం అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 19 నుండి స్ట్రీమ్ కానుంది. ఓ నర్స్ హత్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. షరీఫ్ దర్శకత్వం వహించగా నందిత శ్వేత, వైభవ్ రెడ్డి ప్రధాన పాత్రలు చేశారు. బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటిగా ఉన్న రణం అమెజాన్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయండి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఆర్టికల్ 370. ఈ చిత్రంలో యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలు చేశారు. ఆర్టికల్ 370 చిత్రం ఏప్రిల్ 19 నుండి జియో సినిమాలో అందుబాటులోకి వస్తుంది.

    ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన సైలెన్స్ 2 మూవీ ఏప్రిల్ 19 నుండి జీ 5లో స్ట్రీమ్ కానుంది. సైలెన్స్ 2 థ్రిల్లర్ గా తెరకెక్కింది. వీటితో పాటు నెట్ఫ్లిక్స్ లో రెబల్ మూన్ 2, డ్యూన్ 2 వంటి హాలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. కాగా గత వారం ఓం భీమ్ బుష్, ప్రేమలు, గామి వంటి హిట్ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి.