Karthikeya 2- Bollywood: ఒక తెలుగు యంగ్ హీరో సినిమా ప్రవాహంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కొట్టుకుపోయాయి. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ ఛడ్డా’, అక్షయ్ కుమార్ ” రక్షాబంధన్ సినిమాల వసూళ్లు నిజంగానే ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాయి. సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినా.. ఇప్పటివరకు వీటిలో ఏ సినిమా 50 కోట్ల మార్కును దాటలేదు. పైగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ-2 సినిమా దెబ్బకు అమీర్ – అక్షయ్ సినిమాలు పూర్తిగా చేతులు ఎత్తేశాయి. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. విచిత్రంగా ఈ సినిమాకి హిందీ బెల్టులో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. తొలి రోజు కంటే రెండు రోజు కలెక్షన్స్ పెరిగాయి. రెండో రోజు కంటే.. మూడు రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయి. నాలుగో రోజు బుకింగ్స్ ను బట్టి.. స్టార్ హీరోలు అమీర్ – అక్షయ్ సినిమాలను కూడా పక్కన పెట్టేసి.. హిందీ బయ్యర్లు కార్తికేయ 2కి థియేటర్స్ వేస్తున్నారు. నిజానికి ఆమిర్ ఖాన్, ఆక్షయ్ కుమార్ ల సినిమాలకు బాగా డిమాండ్ ఉంటుంది. కానీ హిందీ ప్రేక్షకులు ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే లాల్ సింగ్ చడ్డా, రక్షాభందన్ సినిమాల వసూళ్లు దారుణంగా వచ్చాయి.
ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా 4 రోజుల్లో 20.96 కోట్ల వసూళ్లను రాబట్టగా, రక్షాభందన్ కేవలం 18.60 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే సాధించింది. ఫస్డ్ డే లాల్ సింగ్ చడ్డా 11 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, రక్షాభందన్ కేవలం 8.20 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి పూర్తిగా నిరాశపరిచింది. తెలుగులో మీడియం రేంజ్ హీరోకి కూడా ఇంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. కానీ, బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం ఆ రేంజ్ కలెక్షన్స్ కూడా రాలేదు.
Also Read: Big Boss 6: బిగ్ బాస్ లోకి లేడీ ‘పుష్ప’.. షేక్ అవ్వడం ఖాయమట..
ఆమిర్ తన లాల్ సింగ్ ఛడ్డా చతికిలపడటం పై అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆమిర్ ఖాన్ ఇంతగా ఫీల్ అవ్వడానికి ఒక కారణం ఉంది. అమీర్ కెరీర్ లోనే అత్యల్ప వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. అన్నిటికీ మించి సినిమా బడ్జెట్ నలభై శాతం కూడా రికవరీ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. మరోవైపు అక్షయ్ కుమార్ రక్షాభందన్ సినిమా పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 90 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లకు కూడా ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో హిందీ బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్నాడు కార్తికేయ 2.
కార్తికేయ 2 మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా హిందీ తెర ను ఒక ఊపు ఊపేస్తోంది. వాస్తవానికి హిందీలో ఈ చిత్రం లిమిటెడ్ స్క్రీన్స్ తో రిలీజ్ అయింది. అయినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. లాల్ సింగ్ చద్దా, రక్షబంధన్ మూవీలు కూడా అందుకోలేని కలెక్షన్స్ ను ఈ సినిమా రాబడుతోంది. ఏది ఏమైనా అమీర్ – అక్షయ్ కుమార్ లను వెనక్కి నెట్టి.. హిందీ బాక్సాఫీస్ వద్ద తెలుగు కుర్ర హీరో నిఖిల్ తన సత్తా చాటుతుండడం విశేషం. తెలుగు హీరోలు ఇలాగే రాణించాలని ఆశిద్దాం.