Karthika Deepam: బుల్లితెరపై రోజురోజుకు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. జైలు నుంచి విడుదలైన మోనిత డాక్టర్ భారతి ఇంట్లో దాక్కొని కార్తీక్ కి ఎదురుపడి కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ భయపెడుతుంది. నువ్వు అమెరికా వెళితే నీ భార్యపై అనుమానం పడ్డవని మీడియా ముందు చెప్తాను అప్పుడు నీ భార్య పరువు పోతుంది నీ పిల్లలు నిన్ను ద్వేషించుకొంటారని అని చెప్పడంతో కార్తిక్ షాక్ అవుతాడు. ఇప్పుడు చెప్పు కార్తీక్ నా మెడలో తాళి కట్టి నా పురుడు బాధ్యతలు తీసుకుంటావా? లేక అమెరికా వెళ్ళిపోతావా అంటూ అడగడంతో కార్తీక్ నీళ్ళు కావాలని అడగడంతో మోనిత నవ్వుతూ ఉండగా పని మనిషి మంచినీళ్లు బాటిల్ తీసుకు వచ్చి కార్తీక్ కి ఇస్తుంది.కార్తీక్ ఆ బాటిల్ తీసుకొని మోనితకి ఇస్తూ అరిచి అరిచి అలసిపోయావు నీళ్లు తాగు.. నువ్వు ఎంత అరిచినా మేము అమెరికా వెళ్తున్నామని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లారు.

కార్తీక్ ఎంతసేపటికి రాకపోతే ఆనందరావు కంగారు పడుతూ ఉంటారు. అప్పటికే దీప పిల్లలు రెడీగా ఉండి అమెరికా ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు. అమెరికా వెళ్ళిన తర్వాత పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఆనంద్ రావు వారికి చెబుతాడు. ఇంతలోనే గతంలో దీపా ఇంట్లో పని చేసిన పని మనిషి మాలతి ఏడుస్తూ తన ఇంట్లోకి వస్తుంది. ఇలా తను ఏడవడంతో సౌందర్య దీప ఎంతో కంగారు పడుతూ ఏమైంది అని అడుగుతారు. ఇదంతా చాటుగా ప్రియమణి చూస్తూ ఉంటుంది. మాలతి ఏడుస్తూ తన భర్త తనని హింసిస్తున్నాడని,తనకు పుట్టిన పిల్లలు తన పిల్లల కాదంటూ కనీసం వారిని చూడటానికి కూడా రావడం లేదంటూ ఏడుస్తుంది.
ఈ సంఘటన అంతా గుమ్మంలో ఉండి కార్తీక్ చూస్తుంటాడు. మాలతి మాటలు విన్న కార్తిక్ గతం గుర్తుకు వస్తుంది. దీప కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి అతను కాదు అంటూ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. మాలతి మాటలు విన్న పిల్లలు ఇలాంటి నాన్నలు కూడా ఉంటారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తారు. ఈ మాటలకు దీపా వారిని తిడుతుంది. అందరికీ నీలాంటి అదృష్టం రాదు కదా దీపమా అని మాలతి అనగా వెంటనే సౌర్య అదృష్టం అంటే ఏంటి అని ప్రశ్నిస్తుంది. దీంతో దీప పిల్లలపై కోపం తెచ్చుకుంటుంది. మాలతికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించగా కార్తిక్ రావడం రావడంతోనే ఎంతో సైలెంట్గా నిలబడిపోతాడు.
కార్తీక్ రాకతో సౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్లి డాడీ హిమ మారిపోయింది. నీ విషయంలో నీ తప్పు లేదని గుర్తించిందని సౌర్య చెప్పడంతో అవును డాడీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదని తన డాడీతో ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ సమయంలో కార్తీక్ మనం అమెరికా వెళ్లడం లేదు అని షాకింగ్ విషయాన్ని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దీంతో దీప బ్యాగ్ తీసుకొని పిల్లలని లోపలికి పదండి అనగా ఆదిత్య సౌందర్య కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక కార్తీక్ అమెరికా ప్రయాణం క్యాన్సిల్ కావడంతో ప్రియమణి ఎంతో సంబరపడుతోంది. మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.